ఆధిపత్యం కోసం ఆరాటం..తారా స్థాయికి చేరిన యుద్ధం..!

ప్రపంచంలో నువ్వా నేనా అన్న రీతిలో ఆధిపత్యం కోసం  అగ్ర రాజ్యాలు అమెరికా ..చైనా లు ఢీ  అంటే ఢీ  అంటున్నాయి. దీంతో వరల్డ్ మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది. అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థలుగా వీటికి పేరున్నది. ఇరు దేశాల మధ్య ట్రేడ్ వార్ కొనసాగుతోంది. నిన్నటి దాకా అంతర్గతంగా ఉన్న ఈ యుద్ధం ఇప్పుడు పచ్చ గడ్డి వేస్తే భగ్గు మనే స్థాయికి చేరుకుంది. అమెరికా చైనా వస్తువులపై అదనపు సుంకాలు విధించింది. ప్రతిగా డ్రాగన్ చైనా యుఎస్ కు చెందిన 75 బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై  సుంకాలు పెంచింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ..సంచలన నిర్ణయం తీసుకున్నారు.

చైనాలో ఉన్న తమ దేశానికి చెందిన అన్ని కంపెనీలన్నీ తిరిగి రావాలని ఆదేశించారు. ఈ ఒక్క డెషిషన్ తో ట్రేడ్ వార్ మరింత ఉగ్ర రూపం దాల్చింది. చైనా తాజాగా విధించిన సుంకాలపై స్పందిస్తానంటూ ట్విట్టర్లో తెలిపారు. మాకు చైనా అక్కర్లేదు. మాకు వాళ్ళతో సంబంధం లేకుంటేనే మంచిది. అమెరికా నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు కొల్లగొడుతున్నాయిని ప్రెసిడెంట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కంట్రీకి చెందిన కంపెనీలన్నీ వెంటనే వదిలి రావాలి. ప్రత్యామ్నాయ మార్గాలు చూసు కోవాలని ఆదేశించామన్నారు ట్రంప్. మీ ఉత్పత్తులను ఇక మన దేశంలోనే తయారు చేయాలని కోరుతున్నానని తెలిపారు.అయితే యుఎస్ ప్రెసిడెంట్ తీసుకున్న నిర్ణయంపై కార్పొరేట్ కంపెనీలు ఇంకా స్పందించలేదు.

ఇల్లు మార్చినంత ఈజీ కాదు. కంపెనీలను మార్చడం. ఫెడ్ ఎక్స్ , అమెజాన్ , యుపీఎస్ , యుఎస్ పోస్టల్ సర్వీసెస్ సహా ట్రాన్స్ పోర్ట్ కంపెనీలకు సైతం ఈ సెగ తగులుకుంది. క్రూడాయిల్ పై కాకుండా అమెరికా తయారీ వాహనాలపై సుంకాల మోత మోగించింది. చైనా దెబ్బకు అబ్బా అంటున్నాయి కంపెనీలు. చైనాకు చెందిన సెల్ ఫోన్స్ , టాయిస్ , లాప్ టాప్స్ , తదితర వస్తువులపై భారీ సుంకం విధించింది ..అమెరికా. దీనికి దిమ్మ తిరిగేలా చైనా ..ఏకంగా 5 వేలకు పైగా యుఎస్ ఉత్పత్తులపై సుంకం విధించేందుకు రెడీ అంటోంది. మొత్తం మీద అమెరికా ..చైనా ల మధ్య నెలకొన్న ట్రేడ్ వార్ ప్రపంచం లోని ఇతర దేశాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

కామెంట్‌లు