ఆశలు ఫలించేనా..సింధు సాధించేనా..?

పూసర్ల వెంకట సింధు మరోసారి వార్తల్లో నిలిచారు. అంతర్జాతీయంగా బ్యాడ్మింటన్ లో మరో మెయిలు రాయి చేరుకునేందుకు ఆమె కొద్ది దూరంలో నిలిచి ఉన్నారు. వరల్డ్ ఛాంపియన్ షిప్ లో తనను ఎంతో కాలం నుంచి ఊరిస్తూ వస్తున్న బంగారు పతాకాన్ని అందుకునే అరుదైన అవకాశం ఆమెను వరించింది. గత రెండు సెషన్లలో సిల్వర్ తో సరి పెట్టుకుంది సింధు. తాను కన్న కలల్ని నిజం చేసుకునే ఛాన్స్ ఇప్పుడు దొరికింది. పసిడిని దక్కించుకునేందుకు మరోసారి రెడీ అయ్యింది. మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్ లో మూడో స్థానంలో ఉన్న చైనాకు చెందిన క్రీడాకారిణి చెన్ యుఫెను సింధు ఓడించింది. ఫైనల్ పోరుకు రెడీ అయ్యింది.

ఆమె ఆట తీరుతో అభిమానులను అలరించింది. కేవలం 40 నిమిషాల లోపే సింధు ఆట కట్టించింది. అంతిమ పోరులో నోజామి తో తలపడనుంది. ఇదిలా ఉండగా ఆమె వరుసగా మూడో సారి ఫైనల్లోకి దూసుకు వెళ్ళింది. మరో వైపు ప్రణీత్ ఓడి పోవడంతో కాంస్యం మాత్రమే దక్కింది. కొంత కాలంగా తనతో పాటు టాప్ షట్టర్లకు కొరకొర రాని కొయ్యగా మారిన వరల్డ్ ప్లేయర్ థై జూయింగ్ ను క్వార్ట్రర్స్ లోనే ఓడించింది సింధు. ఈ టోర్నీలో మొదటి నుంచి అద్భుతమైన రీతిలో ప్రతిభ కనబర్చింది. ఇప్పుడు సింధుకు 24 ఏళ్ళు. దేశం లోని కోట్లాది మంది అభిమానులు ఆమెకు పసిడి అందుకోవాలని కోరుతున్నారు. ఆమెపై గంపెడాశలు పెట్టుకున్నారు. ఇదిలా ఉండగా 2016 లో జరిగిన రియో ఒలంపిక్స్ లో రజత పతకం సాధించారు. ఇందులో  ఈ పతకం సాధించిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు.

2012న అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య ప్రకటించిన ర్యాంకింగ్స్ లో టాప్ 20 జాబితాలో చోటు దక్కించు కోవడం ద్వారా సింధుకు మొదటి సారిగా అంతర్జాతీయ గుర్తింపు లభించింది. 2013 న చైనాలో జరిగిన ప్రపంచ చాంపియన్ షిప్ లో పతకం సాధించారు.  మొట్ట మొదటి భారతీయురాలిగా చరిత్ర తిరగ రాశారు. బ్యాడ్మింటన్ లో పలు విజయాలు స్వంతం చేసుకున్న పీవీ సింధుకు భారత ప్రభుత్వం సమున్నత రీతిలో సత్కరించింది. ఇండియాలో మహిళా క్రీడాకారిణుల్లో భారీగా ఆదాయం ఆర్జిస్తున్న వారిలో సింధు మొదటి స్థానంలో నిలిచారు. అంతకు ముందు సింధుకు కేంద్రం అర్జున, పద్మశ్రీ , రాజీవ్ ఖేల్ రత్న అవార్డులు అందజేసింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!