పోస్ట్‌లు

నవంబర్ 30, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

పాకిస్తాన్ కు ఇండియా షాక్

చిత్రం
ఆసియా ఓసియానియా గ్రూప్‌–1 డేవిస్‌ కప్‌ మ్యాచ్‌లో భారత్‌ స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. పాకిస్తాన్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లోనూ భారత్‌ విజయం సాధించి తన స్కోరు 3-0కు పెంచుకుంది. పురుషుల డబుల్స్‌ విభాగంలో లియాండర్‌ పేస్‌, జీవన్‌ నెడుంజెళియన్‌ జోడీ 6-1, 6-3 అబ్దుల్‌ హుజైఫా రెహ్మాన్‌, షోయబ్‌ మొహమ్మద్‌ తేడాతో గెలిచింది. తొలి సెట్‌ను అవలీలగా గెలుచుకున్న భారత జోడికి రెండో సెట్‌లో కాస్త ప్రతిఘటన ఎదురైంది. స్కోరు 3-3తో ఉన్నప్పుడు నువ్వా నేనా అన్నట్లు సాగింది. కాగా, లియాండర్‌ పేస్‌ జంట​ అద్భుతమైన స్మాష్‌లను సంధించడంతో పైచేయి సాధించింది. ఇదే ఊపును కొనసాగించడంతో ఆ సెట్‌ను 6-3 తేడాతో గెలుచు కోవడంతో పాటు మ్యాచ్‌ను కూడా సొంతం చేసుకుంది. కేవలం 53 నిమిషాల పాటు జరిగిన పోరులో భారత్‌ ఏకపక్ష విజయం నమోదు చేసింది. ఇక్కడ పాకిస్తాన్‌ టెన్నిస్‌ ఆటగాళ్ల అనుభవలేమి స్పష్టంగా కనబడింది. గతేడాది డేవిస్‌ కప్‌ చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన డబుల్స్‌ ఆటగాడిగా రికార్డు సాధించిన లియాండర్‌ పేస్‌ తన రికార్డును మరింత పెంచుకున్నాడు. తాజా విజయంతో డబుల్స్‌ విభాగంలో 44వ గెలుపును అందుకున్నాడు. ఆ తర్వాత స్థానంలో ఇటాలియన్‌ ...

చంపుతా..జైలుకు వెళతా

చిత్రం
వెటర్నరీ డాక్టర్‌ ప్రియాంకను దారుణంగా హత్య చేసిన మృగాలను చంపేయాలంటూ ప్రజలు ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తుంటే.. సోషల్ మీడియా ద్వారా ప్రముఖులు సైతం తమ గళాన్ని వినిపిస్తున్నారు. ఈ ఘటనపై  సినీ నటి పూనమ్‌కౌర్‌ స్పందించారు. ఇలాంటి జంతువులను చంపడాని కైనా తాను సిద్ధమేనని అన్నారు. ఇంతటి ఘాతుకానికి పాల్పడిన ఆ మృగాలకు జైలు శిక్ష అనుభవించడం కాదు, వాళ్లను చంపి నేను జైలుకు వెళతా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుల్లో ఒక వ్యక్తి మతం గురించి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక్కడ మతమనేది సమస్య కానేకాదని స్పష్టం చేశారు. అడవుల్లో అయినా కాస్త మేలేమో, కానీ ఈ జనారణ్యంలోనే కొందరు మనుషులు అతి భయంకరంగా, జంతువుల కంటే ఘోరంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఇలాంటి సమస్యలకు పరిష్కార మార్గాలు ఆలోచించాలి కానీ మత, రాజకీయ రంగులు పులిమి తప్పదోవ పట్టించొద్దని కోరారు. ఈ మేరకు ఆమె ఫేస్‌బుక్‌లో ఓ వీడియోని కూడా పోస్ట్‌ చేశారు. కాగా నిందితులను షాద్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ నుంచి చర్లపల్లి జైలుకు తరలించే క్రమంలో జనం ఆగ్రహంతో ఊగి పోయారు. వారిని తమకు అప్పగించాలంటూ నినాదాలు చేసుకుంటూ స్టేషన్‌లోకి వచ్చేందుకు యత్నించారు. ప్రియాంకా రె...

ఐసీఐసీఐపై కోర్టులో కొచర్ దావా

చిత్రం
ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ సీఈఓ చందా కొచర్‌  తనను సీఈవోగా తొలగించడాన్ని సవాల్‌ చేస్తూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తనను ఉద్యోగం నుంచి తొలగించడంతో పాటు 2009 నుంచి 2019 వరకు పొందిన బోనస్‌లను తిరిగి ఇచ్చేయాలని కోరుతూ, ఐసీఐసీఐ బ్యాంక్‌ బోర్డు నిర్ణయంపై ఆమె కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ రంజిత్‌, జస్టిస్‌ కార్నిక్‌తో కూడిన దర్మాసనం వాదనలు విననుంది. మరోవైపు హేతుబద్దమైన ఆధారాలు, ఆర్‌బీఐ అనుమతి లేకుండా తనను తొలగించడం పైనే, ఆమె పిటిషన్‌లోని ముఖ్య అంశమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. చందాకొచర్‌ తరుపున విక్రమ్‌ నన్‌కాని, సుజయ్‌ కంతవాలా వాదనలు వినిపిస్తుండగా ఐసీసీఐ బ్యాంక్‌ తరపున డారియస్‌ కమ్‌ బాటా వినిపించనున్నారు. కాగా ఐసీఐసీఐ బ్యాంకు సీఈవోగా ఉన్న చందా కొచర్‌పై వీడియోకాన్‌ రుణాలకు సంబంధించిన క్రిడ్‌ ప్రోకోకు పాల్పడ్డారన్న ఆరోపణలు దుమారం రేపాయి. దీనిపై  కేసు నమోదు చేసిన ఈడీ, సీబీఐ చందా కొచర్‌, భర్త దీపక్‌ కొచర్‌తో పాటు ఇతర బంధువులను కూడా చార్జ్‌ షీటులో చేర్చింది. అయితే ప్రారంభంలో చందా కొచర్‌ను బోర్డు వెనకేసుకు వచ్చింది. ఆమెపై వచ్చిన ఆరోపణలపై మాజీ న్యాయమూర్తి బీఎన్‌ క...

అగ్ని పరీక్షలో నెగ్గిన సంకీర్ణం

చిత్రం
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే కీలకమైన బల పరీక్షలో విజయం సాధించారు. గవర్నర్‌ ఆదేశాల మేరకు ప్రొటెం స్పీకర్‌ దిలీప్‌ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బలపరీక్ష సమయంలో ప్రతిపక్ష బీజేపీ సభ నుంచి వాకౌట్‌ చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వానికి 169 మంది సభ్యుల మద్దతు ఉందని, విశ్వాస పరీక్షలో ఉద్ధవ్‌ ప్రభుత్వం నెగ్గిందని ప్రొటెం స్పీకర్‌ ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొలువు తీరినట్లైంది. సభ ప్రారంభమైన అనంతరం శాసససభాపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్‌‌ మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా స్పీకర్‌ సభను నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్‌ ఆదేశాల మేరకు అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా బీజేపీకి చెందిన కాళిదాస్‌ కొలంబకర్‌ను నియమించారని, ఉద్ధవ్‌ ప్రభుత్వం కాళిదాసును తొలగించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. అనంతరం సభ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు వాకౌట్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. ఠాక్రేతో పాటు మూడు పార్టీల నుంచి ఇద్దరు చొప్పున ఆరుగురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఒప్పందంలో భాగంగా అసెంబ్లీ స్పీకర...

తగ్గనున్న సిటీ బస్సులు..సిటీవాసులకు కష్టాలు

చిత్రం
తెలంగాణ ప్రభుత్వం  సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. మెలమెల్లగా ఆర్టీసీని ప్రక్షాళన చేసే దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు చేపట్టారు. హైదరాబాద్ లో పెద్ద ఎత్తున సిటీ బస్సులు తిరుగుతున్నాయి. ఎక్కువగా బస్సు పాసులు కలిగిన వారే అధికంగా ఉన్నారు. ఇదిలా ఉండగా ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావం భాగ్యనగర వాసులపై తీవ్రంగా పడనుంది. ఆర్టీసీ నష్టాల్లో సగం సిటీ నుంచే వస్తుండటంతో సిటీ సర్వీసులను భారీగా తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ఈ నష్టాలను జీహెచ్‌ఎంసీ నిధులతో భర్తీ చేయాలని భావించినా, తాజా సమ్మె సమయంలో అది సాధ్యం కాదని స్వయంగా సర్కారే తేల్చేసింది. హైకోర్టుకు సమర్పించిన వివరాల్లోనూ దీన్ని స్పష్టం చేసింది. దీంతో నష్టాలను తగ్గించు కునేందుకు సిటీ సర్వీసులను కుదించాలన్న దిశగా అధికారులు అందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అయితే ఉన్నఫళంగా సర్వీసులు తగ్గించకున్నా, సిటీ రీజియన్‌లో పదవీ విమరణ చేసే సిబ్బంది స్థానంలో కొత్త వారిని ఇక నియమించరు. దీంతో  బస్సుల సంఖ్యను కూడా కుదించేందుకు మార్గం సుగమమవుతుంది. ప్రస్తుతం నగరంలో ఉన్న 3,500 బస్సుల సంఖ్య క్రమంగా తగ్గనుంది. హైదరాబాద్‌లో బస్సు పాస్‌లతోన...

వెల్లువెత్తిన ప్రజాగ్రహం..నిరసన మధ్య తరలింపు

చిత్రం
వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి దారుణ అత్యాచార, హత్య కేసులో నలుగురు నిందితులకు ఉరి శిక్షే ఖరారు చేయాలని కోరుతూ ప్రజలు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులను షాద్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడ ఎవరినీ స్టేషన్ దరిదాపుల్లోకి రాకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినా వేలాదిగా ప్రజలు స్వచ్ఛందంగా పోలీస్ ఠాణాకు తరలి వచ్చారు. దీంతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్తత చోటు చేసుకుంది. భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. పరిస్థితి అదుపు తప్పడంతో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను రంగంలోకి దించారు. డీజీపీ నుంచి కచ్చితమైన ఆదేశాలు ఉండడం, సమస్య సున్నితమైనది కావడంతో ఎలాంటి లాఠీ ఛార్జి చేయలేదు. కొన్ని గంటల పాటు స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ ను ముట్టడించేందుకు ప్రయత్నం చేశారు. మెజిస్ట్రేట్ నిందితులకు14 రోజుల పాటు రిమాండ్ విధించారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య నిందితులను మహబూబ్ నగర్ జైలుకు తరలించేందుకు అష్టకష్టాలు పడ్డారు. అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రియాంకను దారుణంగా చంపిన నిందితులను తమకు అప్పగించాలని నినాదాలు చేశారు. మరికొందరు జైలుకు కాకుండా ఉరి తీయాలని కోరితే, ఇంక...