అగ్ని పరీక్షలో నెగ్గిన సంకీర్ణం
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కీలకమైన బల పరీక్షలో విజయం సాధించారు. గవర్నర్ ఆదేశాల మేరకు ప్రొటెం స్పీకర్ దిలీప్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బలపరీక్ష సమయంలో ప్రతిపక్ష బీజేపీ సభ నుంచి వాకౌట్ చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వానికి 169 మంది సభ్యుల మద్దతు ఉందని, విశ్వాస పరీక్షలో ఉద్ధవ్ ప్రభుత్వం నెగ్గిందని ప్రొటెం స్పీకర్ ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొలువు తీరినట్లైంది. సభ ప్రారంభమైన అనంతరం శాసససభాపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్ మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా స్పీకర్ సభను నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గవర్నర్ ఆదేశాల మేరకు అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా బీజేపీకి చెందిన కాళిదాస్ కొలంబకర్‌ను నియమించారని, ఉద్ధవ్ ప్రభుత్వం కాళిదాసును తొలగించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. అనంతరం సభ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఠాక్రేతో పాటు మూడు పార్టీల నుంచి ఇద్దరు చొప్పున ఆరుగురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఒప్పందంలో భాగంగా అసెంబ్లీ స్పీకర్ పదవి కాంగ్రెస్‌కు, డిప్యూటీ సీఎం పదవి ఎన్సీపీకి దక్కనున్నాయి. అయితే ఎన్సీపీ తరఫున ఆ పదవిని ఎవరు స్వీకరిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ఎన్సీపీ నుంచి చగన్ భుజ్జల్, జయంత్ పాటిల్‌లు ఇదివరకే మంత్రులుగా ప్రమాణం చేశారు. దీంతో పార్టీపై తిరుగుబాటు చేసి, తిరిగి సొంత గూటికే చేరుకున్న అజిత్ పవార్ పరిస్థితి పార్టీలో ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది.
ఎన్సీపీకి ఎదురు తిరిగి, బీజేపీతో చేతులు కలిపి డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేసిన ఆయన.. తన వర్గం ఎమ్మెల్యేల అండ లేకపోవడం, పవార్ కుటుంబ సభ్యులు ఒత్తిడి తేవడంతో తిరిగి సొంత గూటికే చేరారు. చేసిన తప్పు ఒప్పుకున్నారు. మళ్లీ సొంతగూటికి చేరిన అబ్బాయిని బాబాయ్ శరద్ పవార్ కూడా క్షమించారు. ఇంతవరకు బాగానే ఉన్నా, ఠాక్రే ప్రభుత్వంలో అజిత్‌కు చోటు దక్కుతుందా లేదా అనేది ఆసక్తి కరంగా మారింది. ఎన్సీపీలో అజిత్‌ను అభిమానించే వారు చాలా మంది ఉన్నారు. వీటన్నిటిని గమనించే, శరద్ ఇప్పటి వరకు అజిత్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాగా జయంత్ పాటిల్‌ను కాదని డిప్యూటీ సీఎం పదవిని ఆయనకు అప్పగిస్తారా అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి