సేవకు ప్రతిరూపం..అడ్వొకేట్ ఔదార్యం

అందరూ వెళ్లిన దారుల్లో వెళితే మజా ఏముంటుంది. భిన్నంగా వెళితేనే సక్సెస్ దక్కుతుంది. సమాజంలో మైనార్టీలు అంటేనే చులకన భావన. తెలంగాణాలో ఏ చిన్న సంఘటన జరిగినా ముందుగా హైదరాబాద్ వైపు చూస్తారు. అంతలా అతలాకుతలమై పోయిన సమయంలో, ఉన్నతమైన చదువులు చదువుకుని సమాజంలో గ్రేట్ పొజిషన్ లో కొద్ది మంది మాత్రమే ఉన్నారు. వారిలో ఒకరు ఎం.ఏ.ముజీబ్ సాహబ్. రాష్ట్ర అత్యున్నతమైన హైకోర్టులో అడ్వొకేట్ గా అనతి కాలంలోనే పేరు తెచ్చుకున్నాడు. స్వస్థలం నల్లగొండ జిల్లా. తండ్రి వృత్తి రీత్యా బదిలీ కావడంతో ఉమ్మడి పాలమూరు జిలాల్లో ఎక్కువ కాలం గడిపారు. అక్కడ చదువుకుని, నిజాం కాలేజీలో ఉన్నత విద్య అభ్యసించాడు. విద్యార్ధి దశ నుంచే ప్రగతిశీల భావాలు కలిగి ఉన్నారు. ప్రతి నిత్యం సమస్యలపై నిలదీయడం, ఎక్కడ అన్యాయం జరిగినా వారి తరపున మాట్లాడటం, ప్రశ్నించడం చేస్తూ వచ్చారు. తాను ఎదుగుతూ పది మందికి ఉపాధి కల్పిస్తూ, చేతనైనంత సహాయం చేయడమే టార్గెట్ గా పెట్టుకున్నాడు. మనుషులే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని నమ్మే ఈ లాయర్ కు రాష్ట్ర, దేశ, అంతర్జాతీయంగా మంచి పట్టుంది. అటు తెలుగు, ఇంల్జిష్, ఉర్దూ, హిందీ భాషల్లో మంచి ప్రావీణ్యం ...