గ్రేట్ సక్సెస్..గ్రాండ్ వెల్‌కమ్‌


కోట్లాది జనాన్ని ఉర్రూతలూగించిన బిగ్ బాస్ సీజన్ - 3 ఫైనల్ లో విన్నర్ గా నిలిచిన, పక్కా లోకల్ అయిన ధూల్ పేట కుర్రాడు, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కు అపూర్వమైన రీతిలో స్వాగతం లభించింది. ఈ రియాల్టీ షో 105 రోజుల పాటు సక్సెస్ ఫుల్ గా కొనసాగింది. మొత్తం ఐదు మంది బరిలో నిలవగా, ఇద్దరు ఫైనల్ కు పోటీ పడ్డారు. వీరిలో అంతిమంగా రాహుల్ విజేతగా నిలువగా, యాంకర్ శ్రీ ముఖి రన్నర్ అప్ గా నిలిచింది. ప్రముఖ నటుడు మెగాస్టార్‌ చిరంజీవి చేతుల మీదుగా రాహుల్ ట్రోఫీని అందుకున్నాడు. షో ముగిసిన అనంతరం బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లు ఇంటి బాట పట్టారు. వారికి కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు.

విన్నర్ గా నిలిచిన రాహుల్‌, రన్నరప్‌తో సరిపెట్టుకున్న శ్రీముఖికి దారి పొడవునా జనాలు నీరాజనం పలికారు. వారితో ఫొటోలు తీసుకోడానికి ఎగబడ్డారు. పాతబస్తీ పోరడు రాహుల్‌  గెలుపుతో అభిమానులు రాత్రంతా తీన్మార్‌ డాన్సులతో అదర గొట్టారు. షో నుంచి బయటకు వచ్చిన రాహుల్‌ మాట్లాడారు. ఇద్దరు లెజెండ్స్‌ చేతుల మీదుగా టైటిల్‌ తీసుకోవడం లక్ గా భావిస్తున్నా. నా లైఫ్‌ చేంజ్‌ ఇక నుంచి మారబోతుందని అనుకుంటున్నా. కోట్లాది మంది ఓట్లేసి గెలిపించిన  ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియ చేసుకుంటున్నా.

మిడిల్‌ క్లాస్‌ నుంచి వచ్చిన, అలాంటి నన్ను వేరే లెవల్‌కు తీసుకెళ్లారు. స్ట్రాటజీతో కన్నా నిజాయితీగా ఆడాను. టాస్క్‌ల్లోనూ ప్రయత్నం చేశాను. అదే నా సక్సెస్‌కు కారణమయింది అని రాహుల్‌ చెప్పాడు. అభిమానులు రాహుల్‌కు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఇక శ్రీముఖి టైటిల్‌ గెలవక పోయినా కోట్లాది మంది హృదయాలు గెలుచుకుందని మెగాస్టార్‌ చెప్పుకొచ్చాడు. అన్నట్టుగానే షో నుంచి వచ్చాక ఫ్యాన్స్ తనకు పూలమాలలతో స్వాగతం పలికారు. ఇంటికి చేరుకున్న శ్రీముఖి కుటుంబంతో కలిసి ఎంజాయ్‌ చేస్తున్న ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. మొత్తం మీద బిగ్ బాస్ దెబ్బకు పార్టిసిపెంట్స్ అందరూ పాపులర్ అయిపోయారు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!