తప్పని తిప్పలు..కార్మికుల అవస్థలు


నేతలు పట్టు వీడడం లేదు..ప్రభుత్వం మెట్టు దిగడం లేదు. ఇరువురి మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు కార్మికులకు చుక్కలు చూపిస్తోంది. ఓ వైపు కోట్లాది విలువ గలిగిన ఆస్తులను దారాదత్తం చేసేందుకు లైన్ క్లియర్ చేసుకుంటూ పోతున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. కార్మికులకు డెడ్ లైన్ విధించారు. ఇప్పటికే పలువురు కార్మికులు తట్టు కోలేక, అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంకొందరు గుండెపోటుతో మృతి చెందారు. సీఎం చేసిన సెల్ఫ్ డిస్మిస్ అనే కామెంట్స్ ఆందోళనకు మరింత ఆజ్యం పోసింది. కార్మికులు చేస్తున్న సమ్మె నెల రోజులకు చేరుకుంది. కేసీఆర్ డెడ్ లైన్ ను డోంట్ కేర్ అంటున్నారు కార్మికులు.

సమ్మె కొనసాగింపుపై పట్టు వీడట్లేదు. ప్రభుత్వంతో చర్చలు జరిపిన తర్వాతే విధుల్లో చేరాలనే డిమాండ్‌ నుంచి తగ్గడం లేదు. డెడ్‌లైన్‌ దగ్గర పడటంతో ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరాలా, వద్దా అనే నిర్ణయంపై ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఆర్టీసీ జేఏసీ నేతలు కార్మికులెవరూ విధుల్లో చేరకుండా వారికి ధైర్యం చేప్పేందుకు ఉపక్రమించారు. ఆర్టీసీ జేఏసీలో టీఎంయూ, ఈయూ సంఘాలుండగా, వేరుగా ఉన్న ఎన్‌ఎంయూ నేతలు సైతం మద్దతు పలికారు.
ఆయా సంఘాల నేతలు కార్మికుల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. మెజారిటీ కార్మికులు విలీనం డిమాండ్‌ను పక్కన పెడితే ఎలా ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే ప్రభుత్వం చర్చలు జరిపినప్పుడే ఏయే డిమాండ్ల నుంచి తగ్గాలనే దానిపై నిర్ణయానికి రావాలని చెప్పారు.

కార్మికులెవరూ విధుల్లో చేరొద్దని, ధైర్యంగా ఉండాలని నేతలు చెప్పారు. డిమాండ్లు సాధించుకునే దిశగా సమ్మెను కొనసాగించాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది. ఇదిలా ఉండగా సమ్మె పట్ల ఆర్టీసీ కార్మికులు సానుకూలంగా ఉన్నారని, మీ మద్దతుతోనే  ఉద్యమం జరుగుతోందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మిక సంఘాలను ప్రభుత్వం వెంటనే చర్చలకు ఆహ్వానించాలని నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ డిమాండ్‌ చేసింది. మొత్తం మీద సమ్మె జఠిలం కాదా సర్కారు ప్రైవేట్ జపం చేస్తోంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!