ఇదేమి నగరం..ప్రియాంక అసహనం
భారత దేశ రాజధాని ఢిల్లీ అంటేనే జనం జడుసుకుంటున్నారు. భయాందోళనకు లోనవుతున్నారు. కాలుష్య భూతం కమ్ము కోవడంతో స్థానికులు ఊపిరి ఆడక తల్లడిలి పోతున్నారు. ఇప్పటికే అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు పర్యావరణ కాలుష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినా ఈ రోజు వరకు పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించే లేదు. తాజగా కాలుష్యం దెబ్బకు ఆప్ ప్రభుత్వం కొన్ని రోజుల పాటు సెలవు ప్రకటించింది. మరో వైపు ఇండియా, బాంగ్లాదేశ్ క్రికెట్ మ్యాచ్ చూసేందుకు భారీగా తరలి వచ్చారు ఫ్యాన్స్. వారంతా మాస్క్ లు ధరించి స్టేడియం కు వచ్చారు. వీరితో పాటు ఆటగాళ్లు సైతం మాస్క్ లు ధరించి ఆడారు.
ఇదే సమయంలో ఇండియన్ బ్యూటీ, ప్రముఖ బాలీవుడ్ నటీమణి ప్రియాంక చోప్రా కాలుష్య కోరల్లో చిక్కు కున్నారు. దీని వల్ల సినిమా షూటింగ్ లో పాల్గొనడం చాలా కష్టంగా ఉందన్నారు ఈ గ్లోబల్ స్టార్. ప్రస్తుతం ఆమె ‘ది వైట్ టైగర్ ’ అనే సినిమాలో నటిస్తున్నారు. ప్రముఖ రచయిత అరవింద్ అడిగా ఇదే పేరుతో నవల రాశారు. ఈ నవల ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ఢిల్లీలో ప్రారంభమైంది. షూటింగ్‌లో పాల్గొన్న ప్రియాంక.. కాలుష్యం నుంచి కాపాడు కోవడానికి మాస్క్, కళ్లద్దాలు ధరించి సెట్‌కు వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
ఆమె ఢిల్లీలో వాయు కాలుష్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. కాలుష్యం కారణంగా షూటింగ్‌లో పాల్గొనడం చాలా కష్టంగా ఉందన్నారు. ఇక ఇక్కడ నివసిస్తున్న వారి పరిస్థితి తలచుకుంటే చాలా భయంగా ఉందని చెప్పారు. కాలుష్య కోరల నుంచి కాపాడు కోవడానికి మనకి మాస్క్‌లు ఉన్నాయి. కానీ ఇల్లు లేని నిరాశ్రయులు అష్ట కష్టాలు పడుతూ రోడ్ల మీద నివసిస్తూ, ఈ కాలుష్యంతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారి కోసం ప్రార్థించండి అని ప్రియాంక చోప్రా కోరారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి