దారుణం..సజీవ దహనం

సభ్య సమాజం తల దించుకునే సంఘటనలు ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని చట్టాలు చేసినా, ఎన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా దారుణాలను ఆపలేక పోతున్నారు. పటిష్టమైన భద్రత ఉన్నా అల్లరి మూకలు, దుండగులు మాత్రం ఆగడం లేదు. హత్యలు, మానభంగాలు, దోపిడీలు, రియల్ దందాలు, దాడులు, వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. దేశంలోనే కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నామని చెపుతున్నా జరిగేవి జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మానవ సమూహం తల దించుకునే దారుణం చోటు చేసుకుంది. అది తెలంగాణ రాష్ట్ర కేపిటల్ , ఐటీ హబ్ గా పేరొందిన హైదరాబాద్ నగరం, రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.

ఈ సంఘటనతో ఒక్కసారిగా రాష్ట్రం ఉలిక్కి పడింది. అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్‌ విజయ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తి కిరోసిన్‌ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో తహశీల్దార్‌ తీవ్ర గాయాలతో అక్కడిక్కడే మృతి చెందారు. ఆమె ను కాపాడేందుకు ప్రయత్నించిన పలువురు కూడా గాయాల పాలయ్యారు. కార్యాలయంలో ఆమె విధులు నిర్వర్తిస్తున్న సమయంలోనే ఈ దారుణమైన ఘటన చోటు చేసుకోవడం సంచలనం రేపింది. తొలుత తహశీల్దార్‌తో మాట్లాడటానికి లోపలికి వెళ్లిన దుండుగుడు ఆమెపై కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. నిందితుడిని గౌరెల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.

తహశీల్దార్‌ దారుణ హత్యపై విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి స్పందించారు.
నిందితులు ఎవరైనా చట్ట పరమైన చర్యలు తీసు కోవాలని అధికారులను ఆదేశించారు. ఏదైనా సమస్య ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వచ్చి పరిష్కరించేందుకు కృషి చేయాలే తప్ప అధికారులపై ఇలాంటి చర్యలు చేయడం దారుణమని అన్నారు. అనంతరం ఘటనాస్థలికి చేరుకుని అక్కడి అధికారులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. మరో వైపు ప్రభుత్వం ఈ దారుణంపై సీరియస్ అయ్యింది. ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు విధులు బహిష్కరించారు.ఈ సంఘటన జరగడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!