మెరుగైన జీవితం భీమాతోనే సాధ్యం
కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునేది బంగారం, భూమి తో పాటు జీవిత భీమా కూడా ఒకటి. చాలా మంది ఇన్సూరెన్స్ చేయాలంటే జడుసుకుంటారు. ప్రతి రోజు తినేందుకు, తాగి తందానాలు ఆడేందుకు లక్షలు ఖర్చు చేస్తారు. కానీ ఒక్క పాలసీ చేయమంటే మాత్రం వెనుకడుగు వేస్తారు. జీవితానికి మెరుగైన భద్రత ఇచ్చేది భీమానే. అందుకే భవిష్యత్తు తరాలు బాగు పడాలంటే సంపాదించిన దాంట్లో నుంచి కొంత మొత్తం తీసి ఖర్చు చేయకుండా పొదుపు చేయాలి. సంపాదనను దాచుకునేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు పోస్టాఫీసులు, ఇతర సంస్థలు, మార్గాలు ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
ఈ దేశంలో 130 కోట్ల మందికి పైగా జనాభా ఉంది. వీరిలో 70 శాతానికి పైగా జనం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు. 20 కోట్లకు పైగా జనానికి రెండు పూటలు కూడా భోజనం అందడం లేదు. చాలా మంది అష్ట కష్టాలు పడుతున్నారు. కానీ ఉన్నదంతా మద్యానికి ఖర్చు పెడుతున్నారు. వళ్ళు గుల్ల చేసుకుంటున్నారు. కాపురాలు కూల్చేసు కుంటున్నారు. ఎన్ని ప్రభుత్వాలు ఉన్నా ఏం లాభం కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవు. కానీ ఏదైనా అపాయం జరిగినా లేదా ప్రమాదం సంభవించినా ఇప్పుడు లక్షల్లో ఖర్చవుతోంది. వీటిని భరించాలంటే తలకు మించిన భారంగా మారింది.
ఒక్కసారి వీటి బారిన పడితే చాలు ఇక ఆస్పత్రులకు వెళ్లాల్సిందే. భారీ ఖర్చులు భరించాలంటే భీమా ఉండాల్సిందే.
ఇప్పుడు ప్రభుత్వ, ప్రైవేట్ పరంగా జీవిత భీమా సంస్థలు ఉన్నాయి. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్ మెంట్ అథారిటీ (ఐఆర్డీఏ) భీమా రంగాలు, సంస్థలను నియంత్రిస్తుంది. ఎప్పటికప్పుడు వీటిని పర్యవేక్షిస్తుంది.ఇండియాలో చెప్పుకోదగ్గ కంపెనీలు చాలానే ఉన్నాయి.ఎల్.ఐ.సి, టాటా, కోటక్, ఆంధ్రా, ఎస్బిఐ, ఐసిఐసిఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, స్టార్, రిలయన్స్, తదితర కార్పొరేట్ కంపెనీలు భీమా పాలసీలను అందుబాటు లోకి తీసుకు వచ్చాయి. ఇవి ఆపద సమయంలో ఆదుకుంటాయి. రక్షణ కల్పిస్తాయి. రోజుకు కొద్దీ రూపాయలు జీవిత, ఆరోగ్య భీమా కోసం ఖర్చు చేయాలి. లేకపోతే భవిష్యత్తు అంధకారమవుతుంది.
ఇక ఇండియాలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మెరుగైన సేవలు అందజేస్తూ జనాదరణ పొందుతోంది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా కేవలం ఖాతాదారుల సంక్షేమం కోసమే పని చేస్తోంది. పాలసీ గడువు పూర్తయ్యాక పూర్తి మొత్తాన్ని అందజేస్తోంది. కాగా బీజేపీ ప్రభుత్వం వచ్చా కష్టాలు మొదలయ్యాయి. తాజగా ఎల్‌ఐసీ రెండేళ్ల పైబడి ల్యాప్స్ అయిన పాలసీలను కూడా పునరుద్ధరించుకునే వెసులుబాటు ప్రకటించింది. ఐఆర్‌డీఏఐ నిబంధనల ప్రకారం సాధారణంగా ప్రీమియం చెల్లింపులు ఆపేసిన నాటి నుంచి రెండేళ్ల లోపు మాత్రమే రివైవల్‌కి అవకాశం ఉంది.
2014 జనవరి 1 తర్వాత తీసుకున్న పాలసీలు ల్యాప్స్ అయి రెండేళ్లు దాటిపోతే.. పునరుద్ధరణకు వెసులుబాటు లేదు. అయితే, పాలసీదారులకు జీవిత బీమా కవరేజీ ప్రయోజనాలు లభించేలా వీటిని కూడా రివైవ్ చేసే అవకాశం కల్పించాలంటూ ఎల్‌ఐసీ ఐఆర్డీఏ ను కోరింది. iదానికి అనుగుణంగానే తాజా మార్పులు చేసింది. ఒక రకంగా పాలసీదారులను ఇదో మంచి ఆఫర్ అన్నమాట. ఇంకెందుకు ఆలశ్యం..పాలసీలు ల్యాప్స్ అయినవి వుంటే డబ్బులు కట్టండి..తిరిగి రెన్యూవల్ చేసుకోండి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి