సేవకు ప్రతిరూపం..అడ్వొకేట్ ఔదార్యం


అందరూ వెళ్లిన దారుల్లో వెళితే మజా ఏముంటుంది. భిన్నంగా వెళితేనే సక్సెస్ దక్కుతుంది. సమాజంలో మైనార్టీలు అంటేనే చులకన భావన. తెలంగాణాలో ఏ చిన్న సంఘటన జరిగినా ముందుగా హైదరాబాద్ వైపు చూస్తారు. అంతలా అతలాకుతలమై పోయిన సమయంలో, ఉన్నతమైన చదువులు చదువుకుని సమాజంలో గ్రేట్ పొజిషన్ లో  కొద్ది మంది మాత్రమే ఉన్నారు. వారిలో ఒకరు ఎం.ఏ.ముజీబ్ సాహబ్. రాష్ట్ర అత్యున్నతమైన హైకోర్టులో అడ్వొకేట్ గా అనతి కాలంలోనే పేరు తెచ్చుకున్నాడు. స్వస్థలం నల్లగొండ జిల్లా. తండ్రి వృత్తి రీత్యా బదిలీ కావడంతో ఉమ్మడి పాలమూరు జిలాల్లో ఎక్కువ కాలం గడిపారు. అక్కడ చదువుకుని, నిజాం కాలేజీలో ఉన్నత విద్య అభ్యసించాడు.   విద్యార్ధి దశ నుంచే ప్రగతిశీల భావాలు కలిగి ఉన్నారు.

ప్రతి నిత్యం సమస్యలపై నిలదీయడం, ఎక్కడ అన్యాయం జరిగినా వారి తరపున మాట్లాడటం, ప్రశ్నించడం చేస్తూ వచ్చారు. తాను ఎదుగుతూ పది మందికి ఉపాధి కల్పిస్తూ, చేతనైనంత సహాయం చేయడమే టార్గెట్ గా పెట్టుకున్నాడు. మనుషులే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని నమ్మే ఈ లాయర్ కు రాష్ట్ర, దేశ, అంతర్జాతీయంగా మంచి పట్టుంది. అటు తెలుగు, ఇంల్జిష్, ఉర్దూ, హిందీ భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్నది. మొదటగా చిన్నగా హైద్రాబాద్ కు సెంటర్ గా ఉన్న మాసాబ్ ట్యాంక్ లో ఓ చిన్న గదిలో లాయర్ గా ప్రాక్టీస్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు టాప్ పొజిషన్ కు చేరుకున్నా తన ప్లేస్ ను మార్చలేదు. 

చదువు కోసం ఇబ్బందులు పడ కూడదని, తన తండ్రి స్మారకార్థం ఓ స్వచ్చంధ సంస్థను ఏర్పాటు చేశాడు. తన లాగే ప్రజల కోసం, సమాజ హితం కోసం పని చేసే వారిని, ఆలోచించే వారిని ఒక చోటుకు తీసుకు వచ్చాడు. ఇప్పుడు భాగ్యనగరం లో ముజీబ్ లాయర్ గా, మేధావిగా , సోషల్ వర్కర్ గా, ప్రోగ్రెసివ్ థింకర్ గా వినుతి కెక్కాడు. విద్య, వైద్యం, మతాల మధ్య సామరస్యం కోసం పని చేస్తున్నారు. ఇందు కోసం 1998 లో ఆల్ ఇండియా బజ్ మే రెహమతే ఆలం (ఏ.ఐ.బి.ఆర్.ఏ ) పేరుతో ఎన్.జి.ఓ ను స్టార్ట్ చేశాడు ముజీబ్. ఈ సంస్థకు ప్రెసిడెంట్ ఏం.ఏ.ముజీబ్ సాహబ్ ప్రెసిడెంట్ గా,  కార్యదర్శిగా ముప్తీ సలా ఉద్దీన్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ గా మీరజ్ సయ్యద్, తదితరులు ఉన్నారు.

దీని ద్వారా 1998 మైనార్టీస్, నాన్ మైనార్టీస్ కు చెందిన పేద స్టూడెంట్స్ ను ఎంపిక చేసి..ప్రత్యేకంగా ఆర్మీ రిక్రూట్ మెంట్, సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం స్వంత ఖర్చులతో వీరికి ట్రైనింగ్ తో పాటు ఉచితంగా మెటీరియల్, వసతి సౌకర్యాలు కల్పించారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ తో పాటు సివిల్స్ కోసం కోచింగ్ ఏర్పాటు చేశాడు. ఇందులో ఒకరు పాలమూరు జిల్లాకు చెందిన ముష్రాఫ్ అనే యువకుడు ఐఏఎస్ కు ఎంపికయ్యాడు. ఇదే సంస్థ ఆధ్వర్యంలో నగరంలో యాచకులను గుర్తించి చంచల్ గూడ జైలులో ఆనంద నిలయంలో వెయ్యి మందికి పైగా గుర్తించి చేర్పించారు. మాదక ద్రవ్యాల నిరోధకం కోసం పని చేస్తున్నారు. వృద్దులు, ఆనాధలు, ఆకలితో అలమటిస్తున్న వారిని గుర్తించి వారి ఆకలిని తీర్చే పనిలో పడ్డారు.

ఇందు కోసం హైదరాబాద్ లో నాలుగు హంగర్ పాయింట్లను ఏర్పాటు చేశారు. దీనికి ముజీబ్ పూర్ ఫీడింగ్ పేరు పెట్టాడు. ప్రతి రోజు ఉచితంగా అన్న దానం చేస్తున్నారు. గత నాలుగు ఏళ్ళ నుండి ప్రజల మధ్య సామరస్యం, శాంతి కోసం పని చేస్తున్న వారిని గుర్తించి, సన్మానం, సత్కారం చేయటమే కాదు అవార్డు కూడా అందజేస్తున్నారు ముజీబ్ సాహబ్. 2016 ఏడాదికి గాను అంతర్జాతీయ శాంతి, సామరస్య పురస్కారం ను ప్రముఖ మేధావి, రచయిత కంచె ఐలయ్యకు అంద జేశారు. ఇక 2017 లో పాండు రంగా రావుకు, 2018  లో ఖురాన్ ను మరాఠీ భాషలోకి అనువాదం చేసిన రచయిత రాజస్థాన్ కు చెందిన రాజీవ్ శర్మకు అంద జేశారు.

ఈ అవార్డులను మొదటి నుంచి ముస్లిమేతరులకు అందజేయడం ముజీబ్ ప్రత్యేకత. కాగా ఈసారి 2019 సంవత్సరానికి గాను నగరంలో పేరొందిన హెన్రీ, మార్టిన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇస్లానిక్ స్టడీస్ కు చెందిన డాక్టర్ పాకీయం టి.శ్యామ్యూల్ ను ఇంటర్నేషనల్ పీస్ అండ్ హార్మోనీ అవార్డుకు ఎంపిక చేశారు. హైదరాబాద్ నాంపల్లిలో ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు. పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి రానున్నారు. ఒక దీపం మరో దీపాన్ని వెలిగించినట్లుగా, ఏ సమాజం అయితే తనకు గుర్తింపు ఇచ్చిందో అదే సొసైటీకి తిరిగి సేవ చేస్తున్న ముజీబ్ సాహబ్ ..మరింతగా ఎదగాలని, పేదలకు సాయం చేయాలని ఆశిద్దాం.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!