రసవత్తరం ..కర్ణాటకం ..వేడెక్కిన రాజకీయం

కర్ణాటకలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈసారి ఎలాగైనా తమ ప్రతాపం చూపించాలని కేంద్రంలోని బీజేపీ సర్కార్ పట్టుదలతో ఉంది. గతంలో రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చివరి వరకు అధికారాన్ని చేజిక్కించుకునే దశలో బోల్తా పడింది. రాజకీయ రంగంలో అపర చాణుక్యులుగా పేరొందిన దేవగౌడ, చంద్రబాబు నాయుడులు ఈసారి మిత్రపక్షాలుగా రంగంలోకి దిగారు. ఏపీలో ఎన్నికలు ముగియడంతో దేశవ్యాప్తంగా ఆయా భావసారూప్యత కలిగిన పార్టీలకు మద్ధతుగా బాబు, గౌడలు ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ మద్ధతుతో పవర్‌లో కొనసాగుతున్న గౌడ పరివారం మరోసారి తమ సత్తా చాటేందుకు యత్నిస్తోంది. పార్లమెంట్ స్థానాలను పూర్తిగా మిత్రపక్షం గెలవాలనే పట్టుదలతో పర్యటించారు. వీరికి మద్ధతుగా కాంగ్రెస్ పార్టీ దేశాధ్యక్షుడు రాహుల్ గాంధీ విస్తృతంగా ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. రాయిచూర్‌లో జరిగిన సభలో దేవగౌడ, చంద్రబాబు, రాహుల్‌లు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. వీరంతా బీజేపీ సర్కార్‌పై..మోదీపై నిప్పులు చెరిగారు. ఎన్డీఏ సర్కార్ ఓడిపోత...