సమీక్షల తతంగం..ముదిరిన వివాదం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సంఘం సీఎం చంద్రబాబుకు అడుగడుగునా మోకాలడ్డుతోంది. ఎలాంటి సమీక్షలు..సమావేశాలు నిర్వహించరాదంటూ ఈసీ నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ పూర్తవడంతో టీడీపీ, వైసీపీ పార్టీల మధ్య మాటల వార్ నడుస్తోంది. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ప్రాధాన్య శాఖలకు సంబంధించి ఉన్నతాధికారులపై ఈసీ సీరియస్ గా దృష్టి సారించింది. ఎన్నికల వేళ..ఫలితాలు వచ్చేంత వరకు ఎన్నికల సంఘంకు అన్ని శాఖలకు సంబంధించి కింది స్థాయి నుండి పై స్థాయి అధికారుల దాకా ప్రతి ఒక్కరు కమిషనర్‌కు జవాబుదారీగా ఉండాలి. ఎప్పటికప్పుడు పూర్తి వివరాలను..ఏమేం చేస్తున్నారనే దానిపై రిపోర్టు ఇవ్వాల్సి సమర్పించాల్సి ఉంటుంది. రిజల్ట్స్ వచ్చాక..కొత్త ప్రభుత్వం కొలువు తీరేంత వరకు ప్రస్తుత ప్రభుత్వం తప్పక ఉండి వుంటుంది. ఇది భారత రాజ్యాంగం ఈ సర్కార్‌కు వెసలుబాటు కల్పించింది.
ఎలాంటి సమీక్షలు, మీటింగ్స్ ను నిర్వహించరాదంటూ ఆల్ రెడీ స్పష్టం చేసింది. తాము ఎలాంటి సమీక్షలు నిర్వహించలేదని..ప్రభుత్వం పనిచేయాలంటే అధికారులతో మాట్లాడాల్సి ఉంటుందని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం పోటీ చేసే అభ్యర్థులకు నియమ నిబంధనలు విధించింది. కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ సర్కార్ ..తన టీంలోని పార్టీలకు, నేతలకు, అభ్యర్థులకు సపోర్ట్‌గా ఉంటూ వస్తుండగా..తమను వ్యతిరేకించిన వ్యక్తులు, నేతలను ..పార్టీలను టార్గెట్ చేస్తోంది. ఈసీ పదే పదే జోక్యం చేసుకోవడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఫలితాలు ప్రకటించలేదు కాబట్టి ముఖ్యమంత్రికి ఎలాంటి అధికారాలు వుండవంటూ ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఆరోపించింది. ఆ మేరకు ఆపార్టీ అధినేత వైఎస్ జగన్మో హన్ రెడ్డి తన అనుచరులతో కలిసి రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను కలిశారు.
బాబు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, కొందరు పోలీసులు పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తున్నారంటూ ఆరోపించారు. స్పీకర్‌గా ఉన్న కోడెల శివప్రసాద్ రావు రిగ్గింగ్ కు పాల్పడ్డారంటూ ఫిర్యాదు చేశారు. పోలింగ్ రోజున కాకుండా అయ్యాక..కోడెలపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. వైసీపీ నేతల తీరుపై టీడీపీ సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే తమపై నిరాదారమైన ఆరోపణలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనని ..దాదాపు 200కు పైగా వివిధ రంగాలకు చెందిన కంపెనీలు ఏపీకి తీసుకు వచ్చారని, వేలాది మందికి ఉపాధి కల్పించడం జరిగిందన్నారు. వాస్తవాలు ..వివరాలు తెలుసుకోకుండా విమర్శలు గుప్పించడం ఆ పార్టీకే చెల్లిందన్నారు.
ఎవరు కేసుల్లో నెంబర్ 1 ముద్దాయిగా ఉన్నారో జనానికి తెలుసుని ఆ విషయం గుర్తించి మసులుకుంటే మంచిదన్నారు. ఈసీ ద్వివేది మోదీకి తొత్తుగా మారారని..ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా సమీక్షలు నిర్వహించే అధికారం ఉందన్న నిజాన్ని గుర్తిస్తే బావుంటుందన్నారు. ఆర్థిక నేరగాళ్లకు రాజ్యాంగం గురించి..రాష్ట్ర అభివృద్ధి గురించి ఎందుకు ఆలోచిస్తారని..వారి ధ్యాసంతా అధికారంపైనే తప్ప ప్రజల కోసం కాదన్నారు. మొత్తంగా చూస్తే ఇరు పార్టీల మధ్య వైరం మరింత ముదురుతోంది. ఇంకొన్ని రోజులు ఆగితే కానీ తేలుతుంది ఎవరికి పవర్ దక్కుతుందనే ది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి