పోస్ట్‌లు

డిసెంబర్ 7, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

ఆర్ధిక పరిస్థితిపై ఆందోళన

చిత్రం
దేశంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురాం రాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన గతంలో కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పరిస్థితి ఇలాగే వుంటే గనుక బతకడం కష్టమవుతుందని హెచ్చరించారు. మరోసారి ప్రపంచం మెచ్చిన ఈ ఆర్థికవేత్త, మేధావి రాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశం ప్రస్తుతం తీవ్ర సంక్షోభం దిశగా పయనిస్తోందని హెచ్చరించారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రియల్‌ ఎస్టేట్‌ రంగం, నిర్మాణ రంగం తీవ్ర సంక్షోభాలను ఎదుర్కోనున్నాయని హెచ్చరించారు. ఆయన పలు కీలక విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక మాంద్య పరిస్థితుల్లో వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్టానికి చేరిన విషయాన్ని గుర్తు చేశారు. నిరుద్యోగిత రేటు తీవ్ర స్థాయిలో ఉందని తెలిపారు. రియల్టీ, కన్‌స్ట్రక్షన్‌, మాన్యుఫాక్చర్‌  కంపెనీలకు పెద్ద మొత్తంలో రుణాలిచ్చే ఎన్‌బీఎఫ్‌సీల ఆస్తుల నాణ్యతను పరిశీలించాల్సి వుందని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర బ్యాంకు టాప్‌ 50 నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల పనితీరును సమీక్షిస్తుందన్న ఆయన ఆర్‌బీఐ వాటి పనితీరును, ...

వాహన రంగం..అతలాకుతలం

చిత్రం
ఈ దేశం ప్రస్తుతం ఎన్నడూ లేనంతగా సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా లేదా ఉద్దీపన చర్యలు చేపట్టినా పరిస్థితి అదుపులోకి రావడం లేదు. కేంద్రంలో కొలువుదీరిన బీజేపీ సర్కార్ ఆర్ధిక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. అంతకు ముందు దేశంలో మతం పేరుతో, స్వదేశీ నినాదంతో, హిందుత్వ ఎజెండాతో అధికారంలోకి వచ్చింది. అయోధ్య వివాదం, గుజరాత్ మారణకాండ రెండూ కాషాయ పార్టీని దెబ్బ తీశాయి. కానీ అనూహ్యంగా మోడీ ప్రభ వెలగడం స్టార్ట్ అయ్యాక ఆయన నమ్మిన బంటు అమిత్ చంద్ర షా తో కలిసి ఎక్కడికక్కడ స్వంత పార్టీలో తమకంటూ ఎదురే లేకుండా చేసుకున్నారు. దీంతో అటు విపక్షాలు సైతం వీరి హవాను తట్టుకోలేక మిన్నకుండి పోయారు. ఇటీవలే తమను ఇబ్బందులకు గురి చేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి చిదంబరంకు చుక్కలు చూపించారు. అంతే కాకుండా తీహార్ జైలుకు పంపించారు. ఇదే సమయంలో దేశంలో రెండో సారి పవర్ లోకి వచ్చిన బీజేపీ విపక్షాలను టార్గెట్ చేసింది. దేశంలో ఒకే దేశం, ఒకే జాతి, ఒకే మతం, ఒకే పార్టీ ఉండాలన్న హిడెన్ ఎజెండాతో ముందుకు సాగుతున్నారు ఈ ఇద్దరు నేతలు. నిన్నటి దాకా తమకు ఎదురే లేదని అనుకున్న ఈ ట్రబుల్ షూటర్లక...

ఈ దుఃఖం తీరనిది

చిత్రం
పోయిన మా బిడ్డ తిరిగి రాదు. అనంత లోకాల్లో ఎక్కడో ఉండే ఉంటుంది. కానీ నిన్నటి దాకా మా మధ్యనే నవ్వుతూ మాతో గడిపిన ఆ జ్ఞాపకాలే ఇంకా మాలో కదలాడుతూనే ఉన్నాయి. ఈ గాయం పూడ్చ లేనిది. మానని ఈ పుండు మమ్మల్ని తొలుస్తూనే ఉంటుంది. నిద్రలేని రాత్రులతో గడుపుతూనే ఉన్నాం. ఒక్కోసారి గుర్తుకు వచ్చి నిద్ర మాత్రలు మింగినా నిద్ర పట్టడం లేదు. ఏం చేయాలో పాలు పోవడం లేదు. నేనూ మీలో ఒకడినే. మాజీ సైనికుడిని. కానీ అందరి లాగానే మేము బతకాలని అనుకున్నాం. కానీ దేవుడు మమ్మల్ని ఇలా ఏడ్చేలా చేశాడు. ఈ దుఃఖం అంతకంతకూ పెరుగుతూనే ఉన్నది అంటున్నారు ప్రియాంకా రెడ్డి అలియాస్ దిశా తండ్రి శ్రీధర్ రెడ్డి. తన కూతురు సంఘటనలో నలుగురు నిందితులు ఎన్‌కౌంటర్‌లో మరణించడాన్ని ఆయన స్వాగతించారు. ఈ మాజీ సైనికుడికి గుడ్ ధైర్యం ఎక్కువ. కానీ ముద్దుల కూతురు ఉన్నట్టుండి అత్యాచారానికి గురవడం తో గుండె బరువెక్కిందంటున్నారు. మా పాపకు జరిగిన దారుణం ఇంకే ఆడ కూతురుకు రాకూదంటున్నారు ఈ తండ్రి. దేశంలో ఎక్కడైనా, ఎవ్వరైనా ఇలాంటి దాడులకు పాల్పడితే హైదరాబాద్ పోలీసులు చేసినట్టుగానే కాల్చేస్తేనే న్యాయం జరుగుతుందంటున్నారు. నేరస్థులు భయపడేలా చట్టాల్లో మార్పులు ...

నిత్యానందా..అతనెవరు

చిత్రం
వివాదస్పద స్వామిజీ నిత్యానందకు తమ దేశం ఆశ్రయం కల్పించిందనే వార్తలపై ఈక్వెడార్‌ రాయబార కార్యాలయం స్పందించింది. ఆ వార్తలో ఏ మాత్రం వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఆశ్రయం కోసం నిత్యానంద చేసుకున్న శరణార్థి దరఖాస్తును తమ ప్రభుత్వం తిరస్కరించినట్టు తెలిపింది. దీంతో అతను ఈక్వెడార్‌ నుంచి హైతీ వెళ్లాడని చెప్పింది. ఈక్వెడార్‌ నుంచి నిత్యానంద ద్వీపం కొనుగోలు చేసాడని వస్తున్న వార్తలను ఖండించింది. నిత్యానందకు తాము ఎలాంటి సాయం చేయలేదని వెల్లడించింది. నిత్యానందకు చెందిన కైలాస వెబ్‌సైట్‌లోని సమాచారం ఆధారంగా పలు కథనాలు వెలువడ్డాయని.. అందులో వాస్తవాలు లేవని తెలిపింది. నిత్యానందకు సంబంధించిన విషయాల్లో ఈక్వెడార్‌ పేరును వాడటం మానుకోవాలని మీడియాను కోరింది. కాగా, ఈక్వెడార్‌ నుంచి తాను ఒక చిన్న ద్వీపాన్ని కొనుగోలు దానికి కైలాస పేరు పెట్టినట్టు ఇటీవల నిత్యానంద ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఓ వెబ్‌సైట్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు. కైలాస అనేది రాజకీయేతర హిందూ దేశమని, హిందూత్వ పునరుద్ధరణ కోసం కృషి​ చేస్తోందని అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం అత్యాచారం సహా పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద తనను కాపాడ...

అయ్యో పాపం పోలార్డ్

చిత్రం
టీమిండియాతో జరిగిన మ్యాచ్ లో ఓడి పోవడం మాత్రం తనను ఎంతగానో బాధ పెట్టిందని తన మనసులోని మాటను బయట పెట్టాడు వెస్టిండీస్‌ సారథి కీరన్‌ పొలార్డ్‌. ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించినప్పటికీ ఓటమి పాలవడంపై అసహనం వ్యక్తం చేశాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌పై టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి ఈ ఫార్మట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ నమోదు చేశాడు. అంతే కాకుండా అంతర్జాతీయ టీ20ల్లో భారీ ఛేజింగ్‌ మ్యాచ్‌గా నిన్నటి మ్యాచ్‌ నిలవడం విశేషం. ఇక మ్యాచ్‌ అనంతరం కరేబియన్‌ సారథి పొలార్డ్‌ మాట్లాడాడు. క్రమశిక్షణ లేని బౌలింగ్‌, వ్యూహాలు అమలు చేయడంలో వైఫల్యం చెందడంతోనే ఓటమి చవిచూసినట్లు పేర్కొన్నాడు. పిచ్‌ గురించి ఏం మాట్లాడను. ఎందుకంటే టీ20 ఫార్మట్‌కు ఇలాంటి మైదానాలే కావాలి. మా బ్యాట్స్‌మన్‌ వారి బాధ్యతను సక్రమంగా నిర్వర్తించారు. దీంతో భారీ స్కోర్‌ సాధించ గలిగాం. కానీ మా బౌలర్ల ప్రదర్శన ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. కనీస ప్రాథమిక సూత్రాలను కూడా మా బౌలర్లు పాటించలేదు. ఇందుకు 23 ఎక్స్‌ట్రాలు సమర్పించు కోవడమే ఉదాహరణ. అంతే కాకుండా ...