వాహన రంగం..అతలాకుతలం
ఈ దేశం ప్రస్తుతం ఎన్నడూ లేనంతగా సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా లేదా ఉద్దీపన చర్యలు చేపట్టినా పరిస్థితి అదుపులోకి రావడం లేదు. కేంద్రంలో కొలువుదీరిన బీజేపీ సర్కార్ ఆర్ధిక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. అంతకు ముందు దేశంలో మతం పేరుతో, స్వదేశీ నినాదంతో, హిందుత్వ ఎజెండాతో అధికారంలోకి వచ్చింది. అయోధ్య వివాదం, గుజరాత్ మారణకాండ రెండూ కాషాయ పార్టీని దెబ్బ తీశాయి. కానీ అనూహ్యంగా మోడీ ప్రభ వెలగడం స్టార్ట్ అయ్యాక ఆయన నమ్మిన బంటు అమిత్ చంద్ర షా తో కలిసి ఎక్కడికక్కడ స్వంత పార్టీలో తమకంటూ ఎదురే లేకుండా చేసుకున్నారు. దీంతో అటు విపక్షాలు సైతం వీరి హవాను తట్టుకోలేక మిన్నకుండి పోయారు.
ఇటీవలే తమను ఇబ్బందులకు గురి చేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి చిదంబరంకు చుక్కలు చూపించారు. అంతే కాకుండా తీహార్ జైలుకు పంపించారు. ఇదే సమయంలో దేశంలో రెండో సారి పవర్ లోకి వచ్చిన బీజేపీ విపక్షాలను టార్గెట్ చేసింది. దేశంలో ఒకే దేశం, ఒకే జాతి, ఒకే మతం, ఒకే పార్టీ ఉండాలన్న హిడెన్ ఎజెండాతో ముందుకు సాగుతున్నారు ఈ ఇద్దరు నేతలు. నిన్నటి దాకా తమకు ఎదురే లేదని అనుకున్న ఈ ట్రబుల్ షూటర్లకు మాత్రం శివ సేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే చుక్కలు చూపించారు. తన సత్తా ఏమిటో ప్రూవ్ చేసుకున్నారు. భారీ విజయాలు నమోదు చేసుకున్న, దేశంలో కాషాయ జెండా రెపరెపలాడుతున్నా ఆర్ధిక పరిస్థితి మాత్రం తిరోగమనంలో పురోగమిస్తోంది. నిరుద్యోగం పేరుకు పోయింది. అన్ని రంగాలు ఆర్ధిక పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
తాజాగా ఆటోమొబైల్ రంగం కూడా అదీ బాట పట్టింది. ఇప్పటికే అమ్మకాలు తగ్గడం, ఆశించిన మేరకు వాహనాలు అమ్ముడు పోక పోవడంతో కంపెనీలు తమ ప్లాంట్లను మూసి వేస్తున్నాయి. కొన్ని చోట్ల లాకౌట్లు ప్రకటిస్తున్నాయి. చాలా కంపెనీలు ఉద్యోగులను తీసి వేశాయి. దేశీయ ఆటో పరిశ్రమం సంక్షోభం దిశగా పయనిస్తోంది. ఇతర సెగ్మెంట్లను తీవ్ర ప్రభావితం చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆటో రంగ ఉత్పత్తి 13 శాతం క్షీణతను నమోదు చేసింది. డిమాండ్ తగ్గడం, ఆర్థిక మందగనం కారణంగా పలు సంస్థలు ఇప్పటికే తమ ఉత్పత్తి ప్లాంట్లను తాత్కాలికంగా మూసేశాయి. దీంతో ఆటో రంగంలోనూ ఉద్వాసనలకు తెర లేచింది. అంతేకాదు ఈ ప్రభావంతో ఆటో స్పేర్స్‌లో లక్ష మంది తమ తాత్కాలిక ఉద్యోగాలు కోల్పోయారు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం మరింత ప్రమాదకరం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి