ఈ దుఃఖం తీరనిది
పోయిన మా బిడ్డ తిరిగి రాదు. అనంత లోకాల్లో ఎక్కడో ఉండే ఉంటుంది. కానీ నిన్నటి దాకా మా మధ్యనే నవ్వుతూ మాతో గడిపిన ఆ జ్ఞాపకాలే ఇంకా మాలో కదలాడుతూనే ఉన్నాయి. ఈ గాయం పూడ్చ లేనిది. మానని ఈ పుండు మమ్మల్ని తొలుస్తూనే ఉంటుంది. నిద్రలేని రాత్రులతో గడుపుతూనే ఉన్నాం. ఒక్కోసారి గుర్తుకు వచ్చి నిద్ర మాత్రలు మింగినా నిద్ర పట్టడం లేదు. ఏం చేయాలో పాలు పోవడం లేదు. నేనూ మీలో ఒకడినే. మాజీ సైనికుడిని. కానీ అందరి లాగానే మేము బతకాలని అనుకున్నాం. కానీ దేవుడు మమ్మల్ని ఇలా ఏడ్చేలా చేశాడు. ఈ దుఃఖం అంతకంతకూ పెరుగుతూనే ఉన్నది అంటున్నారు ప్రియాంకా రెడ్డి అలియాస్ దిశా తండ్రి శ్రీధర్ రెడ్డి.
తన కూతురు సంఘటనలో నలుగురు నిందితులు ఎన్‌కౌంటర్‌లో మరణించడాన్ని ఆయన స్వాగతించారు. ఈ మాజీ సైనికుడికి గుడ్ ధైర్యం ఎక్కువ. కానీ ముద్దుల కూతురు ఉన్నట్టుండి అత్యాచారానికి గురవడం తో గుండె బరువెక్కిందంటున్నారు. మా పాపకు జరిగిన దారుణం ఇంకే ఆడ కూతురుకు రాకూదంటున్నారు ఈ తండ్రి. దేశంలో ఎక్కడైనా, ఎవ్వరైనా ఇలాంటి దాడులకు పాల్పడితే హైదరాబాద్ పోలీసులు చేసినట్టుగానే కాల్చేస్తేనే న్యాయం జరుగుతుందంటున్నారు. నేరస్థులు భయపడేలా చట్టాల్లో మార్పులు చేయాల్సి ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కొత్త చట్టాలు తీసుకు రావాలి. నిర్భ య కేసులో ఏడేళ్లు గడిచినా నేటికీ దోషులకు శిక్ష పడలేదు. యూపీలోని ఉన్నావ్‌లో అత్యాచార బాధితురాలిని నిందితులు బెయిల్‌పై వచ్చి మరీ చంపడం అత్యంత హేయం. అందుకే ఆడవారిపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని చట్ట పరంగా, శీఘ్రంగా శిక్షించేలా చట్టాలను బలోపేతం చేయాలనీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను శ్రీధర్ రెడ్డి విన్నవించారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి