పార్టీ భవితవ్యం మీదే..తేడా వస్తే వేటే

ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా అపూర్వమైన విజయాన్ని అందించారు. వారికి అన్ని సౌకర్యాలు కల్పిచాల్సిన బాధ్యత మనందరి పై ఉంది. అంతే కాదు పార్టీ ని మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత ఇంచార్జ్ మంత్రులదే. అలా అని పట్టించుకోక పోతే మాత్రం చర్యలు తప్పవు. ఎమ్మెల్యేలతో పేచీలు, ఇగోలు పక్కన పెట్టాల్సిందే. గ్రామ స్థాయి నుండి నగర స్థాయి దాకా బల పడేలా చేయాల్సింది మీరే అని ఏపీ ముఖ్యమంత్రి సందింటి జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. మిమ్మల్ని పూర్తిగా నమ్మాను. బాధ్యతలు అప్పగిస్తే వాటిని నెరవేర్చక పోతే ఎలాగని నిలదీశారు. పార్టీని బలోపేతం చేయడానికి సాధించిన విజయాలనూ పరిగణనలోకి తీసుకుంటా. ఆరు నెలల పని తీరు ఆధారంగా చేసుకుని చూస్తా. బాగా లేకపోతే పునరాలోచించాల్సి వస్తుంది. పార్టీకి ఎమ్మెల్యేలే బలమని తేల్చి చెప్పారు. జిల్లాల్లో ఎమ్మెల్యేలు, మంత్రుల మధ్య గొడవల వల్ల పార్టీకి నష్టం వాటిల్లుతుంది. ఎమ్మెల్యేలు బలంగా ఉంటేనే.. పార్టీ బలంగా ఉంటుంది. ఎమ్మెల్యేలు, మంత్రుల మధ్య సమన్వయం పెంచే బాధ్యత ఇన్‌చార్జి మంత్రులదే. ప్రతి నెలలో రెండు నుంచి నాలుగు రోజుల పాటు జిల్లాల్లో బస చేయాల్సింద...