ఫస్ట్ ప్రయారిటీ టాలెంట్ కే

తెలుగు సినిమా రంగంలో టాప్ రేంజ్ డైరెక్టర్స్ లలో ఒకడిగా కొనసాగుతున్న పూరి జగన్నాథ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన ఎక్కడుంటే అక్కడ నవ్వులు పూస్తాయి. ఆలోచనలకు రెక్కలు వస్తాయి. సృజనాత్మకత వెళ్లి విరుస్తుంది. పూరి జగన్నాథ్ అంటేనే అంతులేని ఎనర్జీ కి కేరాఫ్. న్యూ టాలెంట్ ఎక్కడ ఉంటే అక్కడ వాలి పోతాడు. ఎలాంటి భేషజాలకు తావివ్వకుండా క్రియేటివిటీకి పెద్ద పీట వేయడం పూరికి అలవాటు. పుస్తకాలు బాగా చదువుతాడు. తన ఇల్లే తన లోగిలి. ప్రపంచాన్ని ప్రభావితం చేసిన తత్వవేత్తలను ఇప్పటికే చదివాడు. అందరి కంటే జగన్నాథ్ కు ఫిలాసఫర్ నీషే అంటే అభిమానం. ఆయనతో పాటు ఓషో కూడా.

ఉన్నది ఒక్కటే జిందగీ అని నమ్మే పూరి ఏది మాట్లాడినా సంచలనమే. ఎందుకంటే పైసా జేబులో లేక పోయినా సరే ఎలా బతకాలో నేర్చు కోవాలంటే..జగన్నాథ్ తో ఐదు నిమిషాలు సంభాషిస్తే చాలు మనలో కోల్పోయిన ఎనర్జీ తిరిగి వస్తుంది. అంతులేని కాన్ఫిడెన్స్ కలుగుతుంది. ఆయనలో తాను గొప్ప డైరెక్టర్ అన్న ఫీలింగ్ ఉండదు. జస్ట్ ఓ సాధారణమైన వ్యక్తిగా మనకు అగు పిస్తాడు. ఇంట్లో మనం ఎలా మాట్లాడుకుంటామో అలాగే మాట్లాడతాడు. ఇగో ను పక్కన పెడితే చాలు ఇక సమస్యలు అంటూ ఉండవంటాడు పూరి జగన్నాథ్. అందుకే ఈ డైరెక్టర్ వెరీ వెరీ డిఫరెంట్. బ్యాంకాక్ అంటే చచ్చేంత ఇష్టపడే ఈ స్టార్ దర్శకుడికి కుట్రలు కుతంత్రాలు తెలియవు. అందుకే తాను నమ్మిన వారితో మోస పోయాడు.

తిరిగి ఫీనిక్స్ పక్షి లాగా మళ్ళీ సక్సెస్ అందుకున్నాడు. తాజాగా నటుడు విజయ దేవర కొండ నిర్మించిన మీకు మాత్రమే చెప్తా సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు హాజరయ్యాడు పూరి జగన్నాథ్. టాలెంట్ ఎక్కడ ఉన్నా సపోర్ట్ చేస్తా. ఎందుకంటే కొత్తగా ఆలోచించే వారికే అవకాశాలు ఎక్కువగా తలుపు తడతాయి. కాకపోతే బాగా కష్టపడాలి. మనల్ని మనం నిరూపించు కోవాలి అంటాడు పూరి. విజయ్‌ వాళ్ల నాన్న గోవర్థన్‌తో వర్క్‌ చేశాను. ఈ చిత్రం ట్రైలర్‌ చూశాను, బావుంది. సినిమా విడుదల కోసం వెయిట్‌ చేస్తున్నాను.

ఈ చిత్రంతో పాటు విజయ్‌ చేస్తున్న ‘వరల్డ్‌ ఫేమస్‌ లవ్‌’ పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నాను అన్నారు. తరుణ్‌ భాస్కర్‌ హీరోగా షామీర్‌ సుల్తాన్‌ దర్శకునిగా చేసిన చిత్రం ‘మీకు మాత్రమే చెప్తా’. ఐదారేళ్ల క్రితం టీవీలో సెలబ్రిటీలందరినీ చూసి నటుడవ్వాలనే కోరిక ఉండేది. అప్పుడు మా నాన్న నన్ను పూరి దగ్గర వర్క్‌ చేయమని చెప్పారు. ఇప్పుడు నేను ఆయనతో వర్క్‌ చేయటం మర్చి పోలేని అనుభూతి కలిగిస్తోందన్నారు విజయ్ దేవరకొండ. మొత్తం మీద జగన్నాథ్ ఎక్కడుంటే అక్కడ టాలెంట్ ఉంటుందన్న మాట.

కామెంట్‌లు