అమెరికా దెబ్బ..టెకీలు అబ్బా


ప్రపంచాన్ని శాసిస్తున్న అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ తన వంకర బుద్దిని మార్చు కోవడం లేదు. ఓ వైపు ఇండియాకు స్నేహ హస్తం చాస్తూనే మరో వైపు మన ఇండియన్స్ పై దెబ్బ కొట్టే పనికి శ్రీకారం చుట్టాడు. నిన్నటి దాకా చిలుక పలుకులు పలికిన ప్రెసిడెంట్ మళ్ళీ మాట మార్చాడు. ఏకంగా టెకీలకు కోలుకోలేని షాకిచ్చింది. తాజాగా యూఎస్‌ ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ సిటిజన్‌ పాలసీ ప్రకారం హెచ్‌-1బీ దరఖాస్తులు 2015 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2019లో భారీగా తగ్గాయి. ఇండియాకు సంబంధించిన దరఖాస్తులు ఎక్కువగా ఉన్నాయి.

వీటిలో 70 శాతం తిరస్కరణకు గురవడం గమనార్హం. ఇందులో కొత్త ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారివే ఎక్కువగా ఉన్నాయి. ఐటీ కంపెనీలకు ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షలు కూడా ఇందుకు ప్రధాన కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. టెక్‌ దిగ్గజం కాగ్నిజెంట్‌ కంపెనీకి చెందిన 60  శాతం దరఖాస్తులు ఎక్కువగా చెల్లుబాటు కాలేదు. ఈ కంపెనీ తో పాటు విప్రో, ఇన్ఫోసిస్‌ కంపెనీలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 2018లో భారత్‌కు చెందిన ఆరు ప్రధానమైన సంస్థలలో 2,145 మందికి మాత్రమే హెచ్‌-1బీ వీసాలు వచ్చాయి.

అమెరికాకు చెందిన అమెజాన్‌ సంస్థలో పనిచేసే విదేశీ ఉద్యోగుల కోసం ఏకంగా 2,399 హెచ్‌-1బీ వీసాలు వచ్చాయి. ఇదెలా సాధ్యమైందని మిగతా దిగ్గజ కంపెనీలు తలలు పట్టుకుంటున్నాయి. గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ప్రభుత్వం భార్యా భర్తలకు ఉద్యోగాలు చేసుకునే సౌలభ్యం కల్పించారు. అమెరికన్లకే ఉద్యోగాలు అనే నినాదంతో అధికారం చేజిక్కించుకున్న ట్రంప్‌ ఇప్పుడు వీసా నిబందనలు కఠినతరం చేశారు. దీంతో అమెరికాలో వీసాలు లభించడం ఇప్పుడు చాలా కష్టతరమైంది. మొత్తం మీద అమెరికా దెబ్బకు టెకీలు అబ్బా అంటున్నారు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!