విడిచి ఉండలేం..బాధను తట్టుకోలేం


నిన్ను విడిచి ఉండలేం. నువ్వు లేకుండా మేం ఆడలేం. నీతో గడిపిన జ్ఞాపకాలు మమ్మల్ని ఉండనీయడం లేదంటూ తోటి సహచరులు ఆవేదన చెందుతున్నారు. లోలోపట కుమిలి పోతున్నారు. ఇదంతా బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ఆటగాళ్ల బాధ ఇది. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) బంగ్లా దేశ్ ఆల్ రౌండర్, క్రికెట్ స్టార్ షకీబ్ అల్ హసన్ పై రెండు సంవత్సరాల పాటు నిషేధం విధించింది. ఈ నిర్ణయాన్ని హసన్ తోటి క్రికెటర్లు జీర్ణించు కోలేక పోతున్నారు. తట్టు కోలేక కన్నీటి పర్యంత మవుతున్నారు. హసన్ లేకుండా క్రికెట్ ఎలా ఆడాలంటూ భావోద్వేగానికి లోనవుతున్నారు.

హసన్ తో తమకున్న అనుబంధాన్ని సీనియర్ బ్యాట్స్ మెన్ రహీం, వెటరన్ బౌలర్ మోర్తజా గుర్తు చేసుకున్నారు. ఇదే విషయాన్నీ సోషల్ మీడియా వేదికగా క్రికెట్ అభిమానులతో పంచుకున్నారు. ఇదిలా ఉండగా తమ తోటి ఆటగాడు ఛాంపియన్ లా హసన్ తిరిగి వస్తాడని, తమ జట్టులో తిరిగి ఆడతాడని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక అడుగు ముందుకు వేసి తమ బంధాన్ని షేర్ చేసుకున్నారు. సమ వయస్కులమైన మేమిద్దరం 18 ఏళ్ల పాటు కలిసి క్రికెట్‌ ఆడాం. మైదానంలో నువ్వు లేకుండా క్రికెట్‌ ఆడాలన్న ఆలోచన ఎంతో బాధగా ఉంది. త్వరలోనే నువ్వు చాంపియన్‌లా తిరిగొస్తావు.

నీకు ఎల్లప్పుడు నా మద్దతు, మొత్తం బంగ్లాదేశ్‌ అండదండలు ఉంటాయి. ధైరంగా ఉండు అంటూ ముష్ఫికర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగం తో పోస్ట్ చేశాడు. హసన్ తో కలిసి ఉన్న ఫోటోను కూడా ఇందులో పెట్టాడు. షకీబ్ కెప్టెన్సీలో వరల్డ్‌కప్‌ ఫైనల్‌ ఆడతాం అంటూ మోర్తాజా పేర్కొన్నాడు. తాను నిద్రలేని రాత్రులు గడపాల్సి ఉంటుందని మోర్తాజా బాధ ను వ్యక్త పరిచాడు. మొత్తం మీద బంగ్లా ఆటగాళ్లు హసన్ కోసం వేచి చూస్తున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!