జీఓ సంచలనం..టీటీడీలో కలకలం
ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరింత దుందుడుకుగా వ్యవహరిస్తున్నారు. పాలనా పరమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఓ వైపు తన అనుయాయులకు ప్రధానమైన పదవులు అప్పగిస్తున్నారు. దీనిపై విపక్షాలు మండి పడుతున్నా డోంట్ కేర్ అంటున్నారు. ఆచరణలో జగన్ తన తాత రాజా రెడ్డిని గుర్తుకు తెస్తున్నారు. ఒక్క రోజులోనే పలు జీఓలు జారీ చేసి జనాన్ని మెస్మరైజ్ చేస్తుండగా, ఆయా శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులు, సిబ్బందిలో గుబులు రేగుతోంది. తాజాగా వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన జిఓ ప్రకంపనలు సృష్టిస్తోంది. జీవో నంబర్ 2323 తిరుమల తిరుపతి దేవస్థానంలో షేక్ చేస్తోంది.
ఈ ఏడాది మార్చి 31లోపు రిటైర్ అయి ఇంకా విధుల్లో కొనసాగుతున్న అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించాలని తాజా జీవోలో ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అప్రమత్తమయ్యారు. అలాంటి ఉద్యోగులందరినీ గుర్తించి నివేదిక సమర్పించాలని అన్ని విభాగాల అధికారులను ఆదేశించారు. వివరాలు అందిన వెంటనే ఆ అరవై మందిని తొలగించేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే రిటైర్ అయిన వారిలో టీటీడీ రిటైర్డ్ సూపరిడెంట్ డాలర్ శేషాద్రిపై కూడా పూర్తి స్థాయిలో వేటు పడనున్నట్లు తెలుస్తోంది.
అంతే కాకుండా టీటీడీ ఇటీవల 12 మంది రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి చేసిన నియామకం కూడా ఈ జీవోతో ఆగి పోనుంది. టీటీడీలో గత కొన్నేళ్లుగా చక్రం తిప్పిన డాలర్ శేషాద్రి తో పాటు ఇతర పూజారులు సైతం ఇంటికి వెళ్లనున్నారు. జగన్ ఒక్కసారి డిసిషన్ తీసుకున్నాడంటే ఇక వెనక్కి తీసుకోడు అన్నది జగ మెరిగిన సత్యం. మోస్ట్ పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న శేషాద్రికి ఈ జిఓ ఓ రకంగా షాక్. అయితే మరోసారి టీటీడీ లో రావాలని ప్రయత్నం చేస్తున్న రమణ దీక్షితులుకు కూడా చెక్ పడినట్లే. మొత్తం మీద ఏపీ సర్కార్ దెబ్బకు ఉద్యోగుల్లో వణుకు మొదలైంది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి