కన్నా నా ప్రాణం కంటే నువ్వే మిన్న
బంధం బలీయ మైనది. దానిని తెంచు కోవాలని అనుకున్నా, దానిని వదిలి ఉండలేం. ఎక్కడికీ వెళ్లలేం. ఇది అనాది నుంచి వస్తున్నదే. ప్రపంచంలో తల్లి తర్వాతే ఎవ్వరైనా. ఎందుకంటే నవ మాసాలు మోసి, కొత్త ప్రాణానికి జీవం పొసే అమ్మ అంటే ఎవరికి ఇష్టం ఉండదు కనుక. ఈ లోకంలో తల్లీ బిడ్డల మధ్య జన్మ జన్మల బంధం దాగి ఉంటుంది. దీనిని చెరపాలని చూసినా అది నిలబడదు. అందుకే కన్నవారు పిల్లల పట్ల అంతులేని వాత్సల్యం తో ఉంటారు. అంత కంటే ఎక్కువగా ప్రేమను కలిగి ఉండడం మామూలే. ప్రపంచంలో ఎంతో ఎత్తుకు ఎదిగినా, లేదా ఉన్నత స్థానం అధిరోహించినా, రికార్డులు బ్రేక్ చేసినా, లోకం విస్తు పోయేలా చరిత్ర సృష్టించినా చివరకు బిడ్డ దగ్గర తల్లులే.
దీనిని నిజం చేస్తూ ఓ పోస్టు చేసింది ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా. ఆమె ప్రముఖ పాకిస్తాన్ కు చెందిన క్రికెటర్ ను పెళ్లి చేసుకుంది. వీరికి గత ఏడాది ఓ బాబు పుట్టాడు. పుట్టి ఏడాది గడిచింది. ఈ సందర్బంగా గ్రాండ్ గా బర్త్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. తన కొడుకుతో దిగిన అప్పటి ఫోటోను సానియా పెట్టారు. నా ప్రాణం ఉన్నంత వరకూ నీ వెన్నంటే ఉంటా అంటూ మీర్జా తన కుమారుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇజ్‌హాన్ మొదటి పుట్టిన రోజు కావడంతో.. సానియా ఇన్‌స్టాగ్రామ్‌ను వేదికగా చేసుకుని తన కుమారుని ఫోటోను జత చేశారు. నువ్వు ఈ ప్రపంచానికి వచ్చి, నా ప్రపంచంగా మారి నేటితో సరిగ్గా ఏడాది పూర్తయింది.
నీవు పుట్టి నప్పుడు ఎలా చిరునవ్వు చిందించావో.. అలానే నువ్వు వెళ్లిన ప్రతిచోటా నవ్వులు పంచుతావని కోరుకుంటున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. శ్వాస ఉన్నంత వరకూ నీ వెన్నంటే ఉంటానని నీకు వాగ్దానం ఇస్తున్నాను. నా చిన్ని తండ్రి నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు, నువ్వు కోరుకునే, చేసే ప్రతి పనిలో నీకు అల్లాహ్ దయ ఉంటుందని ఆకాంక్షిస్తున్నాను అంటూ సుదీర్ఘ పోస్ట్ చేశారు. సానియా చేసిన పోస్టుకు బాలీవుడ్ తారలు హుమా ఖురేషీ, నేహా ధూపియా ఇజ్‌హాన్‌కు బర్త్‌డే విషెస్ చెప్పారు. ఇతరులు కూడా ఆమె పోస్టుకు ఫిదా అయ్యారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి