దిగ్గజ కంపెనీలకు షావోమి ఝలక్

నిన్నటి దాకా స్మార్ట్ మొబైల్స్ తయారీలో వరల్డ్ మార్కెట్ లో టాప్ రేంజ్ లో కొనసాగిన యాపిల్, శాంసంగ్, తదితర దిగ్గజ కంపెనీలకు షావో మీ కోలుకోలేని రీతిలో ఝలక్ ఇస్తోంది. దిమ్మ తిరిగేలా ఇప్పటికే 10 మిలియన్లకు పైగా చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్స్ తయారీ సంస్థ షావో మీ అమ్మకాల్లో రికార్డులను బ్రేక్ చేస్తోంది. దీని దెబ్బకు ఇతర కంపెనీల ఫోన్స్ వెనక్కి తగ్గాయి. తాజాగా భారీ షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది రెడ్ మీ. నాణ్యమైన రీతిలో కెమెరా ఉండేలా, ఇతర మొబైల్స్ లో లేని సౌకర్యాలు, సదుపాయాలను కల్పించేలా డిజైన్స్ కలర్ ఫుల్ గా ఉండేలా, మొబైల్ ప్రేమికులను ఆకట్టుకునేలా తయారు చేసే పనిలో పెద్దది.

ఇదే విషయాన్ని వెల్లడించింది. దీంతో ఇప్పటికే అమ్మకాలు వెనక్కి తగ్గి పునరాలోచనలో పడ్డ దిగ్గజ కంపెనీలు మరోసారి షావో మీ ఎలాంటి ఫోన్ తీసుకు వస్తుందోనని ఆరా తీసే పనిలో పడ్డాయి. ఇదే సమయంలో 5 జీ నెట్ వర్క్ రాబోతోంది. ఇప్పుడున్న 4 జీ మొబైల్స్ పని చేయక పోవచ్చు. ఇదే గనుక జరిగితే ఇప్పుడు కోట్లాది మంది వాడుతున్న స్మార్ట్ ఫోన్స్ ను పాడేయాల్సిందే. ఇది కూడా ఓ రకంగా మొబైల్ తయారీ కంపెనీలకు మళ్ళీ కొత్త ఫోన్స్ తయారు చేయాల్సిందే. ఇదిలా ఉండగా షావో మీ ఏకంగా అయిదు కెమెరాలతో సరి కొత్త మొబైల్ ను త్వరలో లాంచ్ చేయ బోతోంది. 108 ఎంపీ కెమెరా సామర్ధ్యంతో వరల్డ్స్‌ ఫస్ట్‌ స్మార్ట్‌ ఫోన్‌ ను తీసుకు రానుంది.

ఇప్పటికే ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద స్మార్ట్‌ ఫోన్‌ బ్రాండ్‌గా, దేశంలో నెంబర్‌ 1 బ్రాండ్‌గా కొనసాగుతున్న షావోమి మరో సంచలనానికి నాంది పలక నుంది. మొట్ట మొదటి సారిగా భారీ కెమెరాతో స్మార్ట్‌ ఫోన్‌ను విడుదల చేయనుంది. ఈ మేరకు ట్విటర్‌లో ఫోటోను షేర్‌ చేసింది. ఎంఐ నోట్‌ 10, ఎంఐ నోట్‌ 10 ప్రొ పేరుతో స్మార్ట్‌ ఫోన్లను తీసుకు రానుందని తెలుస్తోంది. స్మార్ట్‌ ఫోన్ల కెమెరాల యుగంలో ఒక కొత్త శకం ప్రారభం కానుందని ట్వీట్‌ చేసింది. చైనాలో ఎంఐ సీసీ9 ను నవంబరు 5న లాంచ్‌ చేయనున్నా మంటూ తెలిపింది. ఇక ఫోన్ కావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!