రాహుల్ రహస్యం..ముద్దు మురిపెం
తెలుగు బుల్లి తెరమీద సెన్సేషన్ క్రియేట్ చేస్తూ, రేటింగ్ లో టాప్ రేంజ్ లో కొనసాగుతూ, జనాన్ని మెస్మరైజ్ చేస్తూ సాగి పోతున్న బిగ్ బాస్ రియాల్టీ షోకు త్వరలో శుభం కార్డు పడనుంది. దేశ వ్యాప్తంగా స్టార్ టీవీ బిగ్ బాస్ ప్రోగ్రాం ను ఇదివరకే స్టార్ట్ చేసి పాపులర్ అయ్యింది. ఇదే సమయంలో స్టార్ టీవీ తెలుగులో వినోద రంగంలో ఉన్న మా టీవీని భారీ ప్యాకేజీకి కొనుగోలు చేసింది. కొత్త ప్రోగ్రామ్స్ కు శ్రీకారం చుట్టింది. ఇదే సమయంలో నార్త్ లో దుమ్ము రేపిన బిగ్ బాస్ రియాల్టీ షో ను తెలుగు, తమిళ్, మలయాళం లలో కూడా లాంచ్ చేసింది. మొదటి ఎపిసోడ్ ను ప్రముఖ నటుడు ఎన్ఠీఆర్ హోస్ట్ చేయగా, రెండో ఎపిసోడ్ ను నటుడు నాని ప్రెజెంట్ చేశాడు.
ముచ్చటగా మూడో రియాల్టీ షో ను ప్రముఖ నటుడు నాగార్జున తో నడిపిస్తున్నారు. ఒక్క సారిగా ఈ ప్రోగ్రాం టాప్ రేటింగ్ లో కొనసాగింది. ఇప్పటికే 100 రోజులు పూర్తి చేసుకుంది. పార్టిసిపెంట్స్ అయిదుగురు మాత్రమే మిగిలారు. ఇప్పటికే సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఫైనల్ కు చేరుకోగా మిగతా వారు ఫైనల్ కోసం తంటాలు పడుతున్నారు. ఇదే సమయంలో పాల్గొన్న వారిలో ఒక్కొక్కరి గురించి వీడియో టెలికాస్ట్ చేశారు బిగ్ బాస్. ఈ సందర్బంగా కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. రాహుల్, పునర్నవి ల మధ్య లవ్ జరుగుతోందన్నది వైరల్ గా మారింది.
దీనికి ఆజ్యం పోస్తూ రాహుల్ ఓ నిజం చెప్పాడు. అదేమిటంటే పునర్నవి తనను ముద్దు పెట్టుకుందని, నేను షాక్ కు లోనైన, అంత లోపే ఆమె నా చేయిని కూడా కొరికింది అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పటి దాకా దాచి పెట్టిన ఈ రహస్యం రాహుల్ చెప్పడంతో బట్టబయలు అయ్యింది. ఈ మాటలు కూడా ఇప్పుడు షోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో త్వరలో ముగిసే బిగ్ బాస్ లో ఎవరు విన్నర్ అవుతారనేది మాత్రం ఉత్కంఠ రేపుతోంది. అయితే స్టార్ మా టీవీ యాజమాన్యం ముగింపు కార్యక్రమాన్ని మరింత పాపులర్ అయ్యేలా చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందు కోసం చిరంజీవి రప్పించాలని అనుకుంటోంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి