పోరాటం ఆగదు..విజయం తప్పదు
తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 27 రోజులకు చేరుకుంది. ఇప్పటి దాకా 16 మంది కార్మికులు మృతి చెందారు. ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాలేదు. హైకోర్టు సమ్మె పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టింది. ఒక మెట్టు దిగితే తప్పేమిటని ప్రశ్నించింది. ఓ వైపు కార్మికులు చని పోతున్నారు, మరో వైపు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అయినా ఎలాంటి చర్యలు తీసు కోవడం లేదు. ఇంతకూ రాష్ట్రంలో ప్రభుతం అనేది ఉందా అని అడ్వొకేట్ జనరల్ ను నిలదీసింది. ఇంత జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తించడం మంచి పద్ధతి కాదు. మీరేమో ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంటున్నారు.
మరి హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో మీ సీఎం 100 కోట్ల వరాలు ప్రకటించారు. మరి వాటికి డబ్బులు ఎలా వస్తాయో చెప్పండని కోరింది. దీనికి ఏజీ వద్ద నుంచి సమాధానం రాలేదు. అదనపు ఏజీ అవసరం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏజీ ఏం చేస్తున్నారు. ప్రభుత్వం నిద్ర పోయిందా..ఈ రోజు వరకు పూర్తి స్థాయిలో మేనేజింగ్ డైరెక్టర్ ను ఎందుకు నియమించి లేదు. కార్మికులు తమ ఇబ్బందుల గురించి ఎవ్వరితో చెప్పు కోవాలో మీరే చెప్పండి. ఓ వైపు ప్రజల్లో అసహనం పెరుగుతోంది. అన్ని రోగాలకు ఒకే మందు అన్న రీతిలో మీ ముఖ్యమంత్రి పాలన కొన సాగిస్తున్నారు. ఇలాగేనా వ్యవహరించేది అంటూ ధర్మాసనం మండి పడింది. ఇదే సమయంలో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో సకల జన భేరి సభ చేపట్టారు.
కోర్టు అనుమతితో సభ సక్సెస్ అయ్యింది. ఇదే సమయంలో కరీం నగర్ జిల్లాకు చెందిన డ్రైవర్ గుండె పోటుతో మృతి చెందారు. జిల్లా బంద్ కు జేఏసీ పిలుపు ఇచ్చింది. విపక్షాలు, ప్రజా, విద్యార్ధి సంఘాలు కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపాయి. సమస్యలు పరిష్కరించేంత దాకా ఈ పోరాటం కొనసాగుతుందని నేతలు స్పష్టం చేశారు. అవసరమైతే మిలియన్ మార్చ్ చేపడతామని కోదండ రామ్, రేవంత్ రెడ్డ్, వీహెచ్, మంద కృష్ణ మాదిగ, తదితరులు ప్రకటించారు. మొత్తం మీద ఆర్టీసీ కార్మికుల సమ్మె కేసీఆర్ కు గుదిబండ లాగా తయారైంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి