ప్రయాణీకులకు పసందైన భోజనం
నిత్యం ప్రయాణం చేయాలనుకునే ట్రావెలర్స్ కు తీపి కబురు అందించింది రైల్వే శాఖ. రుచికరమైన భోజనం అందించాలని ప్లాన్ చేస్తోంది. కూర్చునే సీట్ల వద్దకే లంచ్, టిఫిన్స్, టీ, కాఫీ, ఇతర పానీయాలు, తినుబండారాలు అందజేయనుంది ఐఆర్‌సీటీసీ. ట్రైన్ జర్నీలో అమ్మకానికి వచ్చే రుచులు ఆస్వాదించాలని ఉన్నా వాటి నాణ్యత బాగుండదని తినేందుకు, ఆర్డర్ ఇవ్వడానికి జంకుతారు. బయట మార్కెట్, హోటల్స్, రెస్టారెంట్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కంటే ధరలు ఎక్కువగా ఉంటున్నాయి.
దీంతో రైల్వే శాఖ అనుసరిస్తున్న తీరు పట్ల కొంత ఏవగింపు కూడా ఉంది. దీనిపై దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ఐఆర్‌సీటీసీ రంగంలోకి దిగింది. ఆరోగ్య వంతమైన, రుచికరమైన, పరిశుభ్రమైన వాతావరణంలో తయారు చేసిన వంటకాలు అందించాలని రైల్వే శాఖ చర్యలను చేపట్టింది. ఆ క్రమంలోనే పలు ఈ-క్యాటరింగ్ కంపెనీలు ఐఆర్‌సీటీసీతో ఒప్పందం చేసుకుని మరీ జైన్ ఫుడ్ సహా పలు రకాల క్యుసిన్‌లను అందించడానికి ప్రయత్నిస్తున్నాయి.
పీఎన్‌ఆర్ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు సీటు దగ్గరకే ఫుడ్ డెలివరీ చేస్తోంది. ప్రతి చోటా డిస్కౌంట్ రాజ్య మేలుతున్న వేళ, ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌లు కూపన్ కోడ్‌లతో ఆకట్టుకుంటున్నాయి. పోటీని తట్టుకునేలా రైల్ రెస్ట్రో ద్వారా ఆకట్టుకునే ఆఫర్లనూ అందిస్తుంది ఐఆర్‌సీటీసీ. దీంతో ఫుడ్ విషయంలో రైల్వే ప్రయాణికులకు ఈ సౌకర్యం ఓ వరమని చెప్పాలి. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకున్నందుకు సంతోషిస్తున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి