తలైవా తళుక్కు మనేనా..ఐడియా వర్కవుటయ్యేనా
పాన్ ఇండియాలో దిగ్గజ దర్శకులు ఎక్కువగా సినిమాలు తీయాలనుకునే ఒకే ఒక్క హీరో రజనీకాంత్. కోట్లాది అభిమానులను సంపాదించుకున్న ఈ అరుదైన, అద్భుతమైన నటుడి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే అతడి స్థాయి దేశ సరిహద్దులు దాటి..ఇంటర్నేషనల్ ను తాకింది. తమిళ నాడులో ఆయన పేరు చెబితే చాలు జనం పూనకం తో ఊగి పోతారు. ఏ ముహూర్తాన దర్శకుడు బాలచందర్ గైక్వాడ్ పేరును రజనీకాంత్ అని పేరు మార్చాడో, ఇక అప్పటి నుంచి కొన్నేళ్లుగా సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తూ వస్తున్నాడు. అతడు మాట్లాడితే, నటిస్తే చాలు కోట్లు వసూలవుతాయి. ఆయనకు ఉన్నంత క్రేజ్ ఏ నటుడికీ లేదు.
డిఫ్ఫరెంట్ కాన్సెప్ట్స్ తో తీసే డైరెక్టర్స్ అంటే తలైవాకు ఇష్టం. అందుకే తనకన్నా వయసులో చిన్న వాళ్ళైనా సరే సినిమాలు చేస్తూ వస్తున్నాడు ఈ అగ్ర నటుడు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ఆయన ఫ్యాన్స్ వత్తిడి చేస్తున్నారు. వయసు రీత్యా చూసుకున్నా అయన ఇంకా నవ యవ్వనుడిగా అగుపిస్తున్నారు. తన కూతురు వయసున్న వాళ్ల తో ధీటుగా పోటీపడి డ్యాన్సులు చేస్తున్నారు. బీజేపీ ఆయనతో ఇప్పటికే టచ్ లో ఉంది. కానీ తలైవా ఇప్పటి దాకా నోరు మెదప లేదు. తాజాగా పాన్ డైరెక్టర్ మురుగదాస్ తో దర్బార్ సినిమా తీస్తున్నాడు. చాలా ఏళ్ళ తర్వాత రజనీకాంత్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.
ఇప్పటికే పోస్టర్స్, టీజర్ దుమ్ము రేపుతున్నాయి. ఇది ఇంకా విడుదల కాకుండానే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు రజని. దర్శకుడు శివ డైరెక్షన్‌లో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మింస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్టు గురించి ప్రస్తుతం పలు ఊహాగానాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సూపర్‌స్టార్ రజనీ పుట్టిన రోజు సందర్భంగా డిసెంబర్ 12న ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభం కానుందని, ఈ సినిమా కోసం ఒక టైటిల్ కూడా పరిశీలనలో ఉందని టాక్ స్ప్రెడ్ అయ్యింది. దర్శకుడు శివకు ‘వీ’ సెంటిమెంట్ ఉన్న సంగతి తెలిసిందే. ఇంతకు ముందు అజిత్ హీరోగా చేసిన నాలుగు చిత్రాల టైటిల్స్ వీతోనే మొదలయ్యాయి.
వీరం, వేదాళం, వివేగం, విశ్వాసం ఇలా శివ ‘వీ’ టైటిల్ చిత్రాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో రజనీకాంత్‌తో చేసే చిత్రానికి ‘వీ’ సెంటిమెంట్ కలిసివ చ్చేలా ‘వ్యూహం’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా తలైవా పొలిటికల్ ఎంట్రీకి కూడా పనికొచ్చేలా ఉంటుందని అంటున్నారు. ఇందులో నటి జ్యోతిక, కీర్తీ సురేశ్ హీరోయిన్లుగా నటించనున్నట్లు తెలుస్తోంది. రజనీకాంత్ 168వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేసి 2020లో సమ్మర్ స్పెషల్‌గా తెరపైకి తీసుకు రావాలని భావిస్తున్నారు. మొత్తం మీద తలైవా ఏది చేసినా సంచలనమే. అది అభిమానులకు పండగే.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి