మళ్లీ జన్మిస్తావా..దేవానంద్ ..!

నిద్రలో కలవరించే అందం ఆయన స్వంతం. అతడే జగమెరిగిన..జనం మెచ్చిన ..ఎవర్ గ్రీన్ హీరో..దేవానంద్. ఆ ముగ్ధ మనోహరమైన రూపం ఆయనకు మాత్రమే స్వంతం. ప్రకృతి విప్పారినట్టు..పూలన్నీ ఒకే చోట వాలినట్టు..ఎంతటి అద్భుతమైన..ఆకర్షణీయమైన..రమణీయమైన శరీరం..పడుకుంటే..కిటికీ పక్కన తొంగి చూస్తే..గాలి తెమ్మెరలు తాకుతుంటే..ప్రియురాలి ముంగురులు కళ్లను..వాకిళ్లను..చూపుల్ని కట్టి పడేస్తుంటే..అపుడు లయాత్మకంగా ..గైడ్ సినిమా హత్తుకుంటుంది. ఎవరూ లేకుంటే బావుండనిపిస్తుంది..ఏకాంతంలో ఒక్కళ్లమే ..గదిలో తచ్చట్లాడుతుంటే..దేవానంద్ పలకరిస్తాడు..పలవరించేలా చేస్తాడు..అదీ ఆయన స్పెషాలిటీ..భౌతికంగా లేరు..కానీ మానసికంగా ఆ సమ్మోహన భరితమైన ..ఎల్లవేళలా వసంతంలా ..చిగురించే కొమ్మల్లా ..ఆ నవ్వు ..అన్నింటిని కదిలిస్తుంది..అందమంటే ఏమిటి..ఆకర్షణా కాదు అదో అనిర్విచనీయమైన అనుబంధం. గాతా రహే మేరా దిల్ ..అంటూ పిల్లతెమ్మరలా కిషోర్ కుమార్..లతా మంగేష్కర్ లు పాడుతూ వుంటే..దేవానంద్ అభినయం అద్వితీయం..అజరామరం. భారతీయ సినిమా ఫ్లాట్ ఫాంలో చెరగని ముద్ర వేసుకున్న సినిమా అ...