పోస్ట్‌లు

మార్చి 29, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

ఈ ఐఏఎస్ జ‌నం మెచ్చిన దేవుడు

చిత్రం
ఇండియాలో అత్యున్న‌త‌మైన అధికారిక స‌ర్వీసుగా పేరొందిన సివిల్ స‌ర్వీసెస్‌లో ఉత్త‌మ ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రిచిన వాళ్లు ఎంద‌రో. చాలా మంది ఐఏఎస్‌లుగా ప‌నిచేస్తున్నా కొంద‌రు మాత్రం ప్ర‌జా సేవ‌లో మునిగి తేలుతున్నారు. జ‌నం కోస‌మే బ‌తుకుతున్నారు. అలాంటి వారిలో మ‌ణిపూర్‌కు చెందిన ఆర్మ్ స్ట్రాంగ్ పామే ఒక‌రు. నాగాలాండ్ ప్రాంతంలోని జేమే తెగ‌కు చెందిన పామే ప్ర‌పంచం త‌న వైపు చూసేలా ప‌నిచేశాడు. 2015లో దేశంలోనే అత్యుత్త‌మ‌మైన ఐఏఎస్ అధికారి అవార్డును పొందారు. సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన పామే..2005లో డిల్లీ కేంద్రంగా సివిల్ స‌ర్వీసెస్ ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యాడు. 2007లో జ‌రిగిన ఎగ్జామ్స్‌లో ఇండియ‌న్ రెవిన్యూ స‌ర్వీసెస్‌కు ఎంపిక‌య్యాడు. క‌స్ట‌మ్స్ అండ్ సెంట్ర‌ల్ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌లో చేరాడు. 2008లో ఎంపిక చేసిన జాబితాలో ఇండియ‌న్ అడ్మినిస్ట్రేటివ్ స‌ర్వీస్ కు సెలెక్ట్ అయ్యాడు. మ‌నోడు అంద‌రిలాగా అధికారాన్ని చెలాయించ‌లేదు. త‌న బాధ్య‌త‌లేమిటో గుర్తించాడు. తాను ఎందుకు ఉన్నాడో తెలుసుకుని ..తానే అంద‌రికంటే ముందు ప‌ని చేయ‌డంలో నిమ‌గ్న‌మ‌య్యాడు. మ‌ణిపూర్ నుండి నాగాలాండ్ ..అసోం వ‌ర‌కు 100...