ఈ పురస్కారం సావిత్రికి అంకితం

జీవితంలో మరిచిపోలేని సన్నివేశం ఇది. సినీ రంగంలో సావిత్రి లాంటి నటీమణి పుట్టరు. ఆమె లోని నటన అమోఘం. అలాంటి గొప్ప నటి పాత్రకు నన్ను ఎంపిక చేయడం, పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నా. ఇలాంటి అదృష్టం ఎందరికి వస్తుంది. అదే నన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఆమె పై నుంచి నన్ను దీవించారు. అందుకే నేను ఆ మహానటి పాత్రలో లీనమయ్యా. నన్ను దర్శకుడు నాగ్ అశ్విన్ ఎంపిక చేసినప్పుడు చాలా మంది పలు రకాలుగా విమర్శలు చేశారు. కానీ నేను వాటిని ఏవీ పట్టించు కోలేదు. కేవలం పాత్రలో జీవించేందుకు కష్టపడ్డా. ఇందులో నా పాత్రంటూ ఏమీ లేదు. ఇదంతా ఆ మహానుభావురాలుకు మాత్రమే దక్కుతుంది. అంతకంటే ఎక్కువగా ఈ క్రెడిట్ అంతా డైరెక్టర్ నాగ్ దేనంటూ స్పష్టం చేసింది ప్రముఖ నటి కీర్తి సురేష్. ఈ బ్యూటీ చాలా తక్కువ వ్యవధిలోనే అద్భుతమైన నటిగా పేరు తెచ్చుకుంది. అన్ని సినిమాలు ఒక ఎట్టు. ఈ మహానటి సినిమా మరో ఎత్తు. ఈ చిత్రంలో కీర్తీ సురేశ్ మహానటి సావిత్రి పాత్రలో నటించిందనడం కంటే జీవించిందని చెప్పడం కరెక్ట్. మహానటి చిత్రంలో సావిత్రి పాత్రలో కీర్తీసురేశ్‌ను ఎంపిక చేశారనగానే విమర్శించిన వారే గానీ, ప్రోత్సహించిన వారు లేరనే చెప్పాలి. అయినా అలాంటి వ...