వారెవ్వా..తలైవా

తమిళనాడులో సూపర్ స్టార్, ఇండియాలో రైజింగ్ స్టార్ గా ఇప్పటికే తనకంటూ ఓ రేంజ్ ఏర్పాటు చేసుకున్న ఎదురైనా హీరో రజనీకాంత్. కోట్లాది మంది అభిమానులు ఈ నటుడిని ప్రేమగా తలైవా అని పిలుచుకుంటారు. తాజాగా పాన్ ఇండియా డైరెక్టర్ ఏ.ఆర్.మురుగదాస్ డైరెక్షన్ లో రజనీకాంత్, నయనతార కలిసి దర్బార్ సినిమా తీశారు. ఇప్పటికే సినిమా పూర్తయింది. సినిమాకు సంబంధించి మూవీ ట్రైలర్ కూడా వచ్చేసింది. లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై ఎ.సుభాస్కరన్‌ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్‌ కానుంది. ఈ చిత్రాన్ని ఎన్వీ ప్రసాద్‌ తెలుగులో విడుదల చేయనున్నారు. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో రజనీ ఇంట్రడక్షన్ సాంగ్ 'దుమ్ము ధూళి' విడుదలైంది.

యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో దూసుకు వెళుతూ రికార్డులు సృష్టిస్తోంది. ఈ పాటకి అనంత శ్రీరామ్‌ సాహిత్యం అందిచగా, ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆలపించారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో పాట విడుదలైంది. డుమ్ డుమ్ అంటూ సాగే ఈ పాట రజనీ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటుంది. పెళ్లికి ముందు, తర్వాత భార్య భర్తలు ఎలా ఉండాలి అనే అంశాన్ని పాట రూపంలో చక్కగా తెలియ జేశారు. పెళ్లి నేపథ్యంలో వచ్చే ఈ ఎనర్జిటిక్‌ సాంగ్‌కు కృష్ణకాంత్‌ లిరిక్స్‌ అందించగా, మకాష్‌ అజీజ్‌ ఆలపించాడు. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నివేదా థామస్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.

మరో వైపు దర్బార్ పోస్టర్స్ ఎక్కడ చూసిన తమిళ నాట అగుపిస్తున్నాయి. ఇప్పటికే థియేటర్స్ కూడా బుక్ చేశారు. అటు రజనీ కాంత్ కు ఇటు డైరెక్టర్ మురుగదాస్ కు దర్బార్ కీలకం కానుంది. ఎందుకంటే గత ఏడాది వీరి సినిమాలు ఆడలేదు. అందుకే పూర్తి గా మనసు పెట్టి తీశాడు మురుగదాస్. రాజన్ ఫ్యాన్స్ మాత్రం దర్బార్ కోసం ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఈసారి సంక్రాంతి పండుగ కు సినీ అభిమానులకు పండుగ కానుంది. ఎందుకంటే తెలుగులో ప్రిన్స్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరూ, బన్నీ నటిస్తున్న ఆలా వైకుంఠపురంలో రిలీజ్ కానున్నాయి. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!