బ్రాడ్ బ్యాండ్ బాజా
వరల్డ్ క్రికెట్ లో మరో అరుదైన రికార్డు నమోదైంది. క్రికెట్ ఆటకు ఉన్నంత క్రేజ్ ఇంకే ఆటకు లేక పోవడంతో ఇదే ఆటలో టాప్ రేంజ్ లో ప్రతిభ చూపే ఆటగాళ్ల పంట పండుతోంది. ఊహించని రీతిలో ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిపోతున్నారు. ఇటీవలే ఇండియన్ కెప్టెన్ విరాట్ కోహ్లీ పరుగుల వరద పారిస్తూ తన దరిదాపుల్లోకి ఎవరూ రాకుండా రికార్డులు బ్రేక్ చేసుకుంటూ వెళుతున్నాడు. మరో వైపు ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ తాజాగా సెన్సేషనల్ రికార్డు సృష్టించాడు. ఈ దశాబ్దంలో నాలుగు వందల వికెట్లను సాధించిన రెండో బౌలర్‌గా నిలిచాడు. సహచర బౌలర్ జేమ్స్ అండర్సన్ తర్వాత స్థానాన్ని ఆక్రమించాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌లో భాగంగా ఆ జట్టు కెప్టెన్ డుప్లెసిస్ వికెట్‌ను తీసిన తర్వాత బ్రాడ్ ఈ ఫీట్‌ను సాధించాడు.
అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్లలో అండర్సన్ 428 వికెట్లతో టాప్‌లో నిలవగా, ఆ తర్వాత బ్రాడ్ నిలిచాడు. ఓవరాల్‌గా తమ టెస్టు కెరీర్‌లో అండర్సన్ ఇప్పటివరకూ 576 వికెట్లు సాధించగా, బ్రాడ్ 473 వికెట్లు తీశాడు. కాగా, అత్యధిక టెస్టు వికెట్లు సాధించిన జాబితాలో అండర్సన్, బ్రాడ్‌ల తర్వాత స్థానంలో ముగ్గురూ స్పిన్నర్లే ఉన్నారు. ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయన్ 376 మూడో స్థానంలో ఉండగా, శ్రీలంక స్పిన్నర్ రంగనా హెరాత్ 363 నాల్గో స్థానంలో ఉన్నాడు. ఇక టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 362 ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు.
దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో బ్రాడ్ తన తొలి వికెట్‌గా హమ్జాను పెవిలియన్‌కు పంపడంతో ఈ అరుదైన ఫీట్ ను స్వంతం చేసుకున్నాడు ఈ క్రికెటర్. రాబోయే రోజుల్లో మరిన్ని వికెట్లు పడగొడతాడో వేచి చూడాల్సిందే. ఇప్పటికే అండర్ డాగ్స్ గా తక్కువ అంచనా వేసిన ఇతర జట్లకు ఇంగ్లాండ్ జట్టు ఏకంగా చాలా ఏళ్ళ తర్వాత ప్రపంచ కప్ గెలుచుకుంది. ఇది కూడా ఓ రికార్డ్. ఏ టోర్నమెంట్ లో బ్రాడ్ తన బౌలింగ్ తో దుమ్ము రేపాడు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి