పెరిగిన ఆర్ఆర్ వాల్యూ
భారతీయ వ్యాపార, వాణిజ్య రంగాలపై పట్టు సాధిస్తూ, తనకు ఎదురే లేకుండా చేసుకుంటూ వెళుతున్న రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ మరోసారి తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటూ వస్తోంది. ఆయిల్, టెలికాం, ఎలక్ట్రానిక్స్ , ఫ్యాషన్ , టాయిస్, డిజిటల్, ఆర్నమెంట్స్, తదితర రంగాలకు విస్తరించిన రిలయన్స్ మరోసారి రిటైల్ రంగంలో కూడా దుమ్ము రేపుతోంది. తాజాగా మార్కెట్ అంచనాల ప్రకారం చూస్తే గనుక రిలయన్స్ రిటైల్ విలువ 2.4 లక్షల కోట్లు గా ఉంది. రిటైల్ వాటాదారుల కోసం రిలయన్స్ గ్రూప్ ప్రతిపాదించిన షేర్ల మార్పిడి స్కీమ్ ఆధారంగా చూస్తే ఈ విలువ మరింత పెరిగింది. ఇండియాలో అతి పెద్ద సూపర్ మార్కెట్ చెయిన్ గా రిలయన్స్ ఇప్పటికే రికార్డ్ బ్రేక్ చేసింది. మరో వైపు డిమార్ట్ కూడా రిలయన్స్ రిటైల్ కు గట్టి పోటీదారుగా ఉంటోంది.
దీని అవెన్యూ సూపర్ మార్ట్స్ మార్కెట్ విలువ దాదాపు 1.20 లక్షల కోట్లు గా ఉంది. డిమార్ట్ కంటే రిలయన్స్ మార్కెట్ వాల్యూ రెట్టింపుగా ఉంది. ఇంగ్లాండ్‌లో అతి పెద్ద సూపర్ మార్కెట్ చెయిన్ టెస్కో విలువ 3,200 కోట్ల డాలర్లు కంటే కూడా అధికం కావడం విశేషం. షేర్ల మార్పిడి స్కీమ్‌లో భాగంగా ప్రతి నాలుగు రిలయన్స్ రిటైల్ షేర్లకు గాను ఒక రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్‌ను పొందవచ్చని రిలయన్స్ రిటైల్ వెల్లడించింది. రిలయన్స్ రిటైల్ కంపెనీ తన ఉద్యోగులకు 2006, 2007 సంవత్సరాల్లో స్టాక్ ఆప్షన్స్ ఇచ్చింది. కొంత మంది ఉద్యోగులు ఈ ఆర్‌ఎస్‌యూ ను ఈక్విటీ షేర్లుగా మార్చుకున్నారు. ఈక్విటీ షేర్లు పొందిన ఉద్యోగులు వీటిని నగదుగా మార్చుకునే అవకాశం కల్పించాలని కోరుతున్నారని రిలయన్స్ రిటైల్ తెలిపింది.
రిలయన్స్ రిటైల్‌లో 99.95 వాటా రిలయన్స్ రిటైల్ వెంచర్‌కు ఉందని, మిగిలిన 0.05 శాతం వాటా ఉద్యోగుల వద్ద ఉందని వివరించింది. ఈ షేర్ల మార్పిడి స్కీమ్‌కు ఆమోదం పొందడం కోసం వచ్చే నెల 23న ఈక్విటీ వాటాదారుల సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపింది. దేశవ్యాప్తంగా 10,901 స్టోర్స్‌ను నిర్వహిస్తోంది రిలయన్స్ రిటైల్. కంపెనీ ఆదాయం 89 శాతం వృద్ధితో 1.3 లక్షల కోట్లకు పెరిగింది. నిర్వహణ లాభం 169 శాతం ఎగసి 5,550 కోట్లకు చేరింది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు పరోక్ష అనుబంధ సంస్థగా రిలయన్స్ రిటైల్ వ్యవహరిస్తోంది. రిలయన్స్ షేర్ 1,516 వద్ద ముగిసింది. మొత్తంగా చూస్తే రిలయన్స్ కంపెనీలో కొద్దిపాటి పొదుపు చేస్తే చాలు కోటీశ్వరులు కావొచ్చు అన్నమాట.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి