ఆండర్సన్ వరల్డ్ రికార్డ్

ప్రపంచ క్రికెట్ కప్ గెలిచాక ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్ మరింత దూకుడు పెంచింది. ఓ వైపు ప్రధాన పేసర్ గా ఉన్న బ్రాడ్ 400 వికెట్ల క్లబ్ లో చేరితే, ఇదే కంట్రీకి చెందిన మరో క్రికెట్ దిగ్గజం జేమ్స్‌ అండర్సన్‌ క్రికెట్‌ చరిత్రలోనే నూతన అధ్యాయాన్ని లిఖించాడు. ఇప్పటి వరకూ ఏ బౌలర్‌కు సాధ్యం కాని ఘనతను సాధించాడు. ఒక బౌలర్‌ క్రికెట్‌లో సుదీర్ఘ కాలం కొనసాగడమే చాలా కష్టం. ఎందుకంటే ఎక్కువ కాలం ఆడాలంటే పూర్తి ఫిట్ నెస్ తో ఉండాల్సిందే. ఇక అరుదైన ఘనతను సాధించడం చిరస్మరణీయంగా మిగిలి పోతుంది. ఇప్పటి దాకా కేవలం బ్యాట్స్‌మెన్‌లు మాత్రమే ఉన్న ఈ జాబితాలో మొదటిసారిగా అండర్సన్‌ స్థానం సంపాదించాడు. టెస్టు కెరీర్‌లో 150 అంతకంటే మ్యాచ్‌లు ఆడిన జాబితాలో ఈ క్రికెటర్ దక్కించు కోవడం విశేషం.

దక్షిణాఫ్రికాతో సెంచూరియన్‌లో ఆరంభమైన తొలి టెస్టు ద్వారా అండర్సన్‌ ఈ ఫార్మాట్‌లో 150 మ్యాచ్‌ను చేరుకున్నాడు. ఫలితంగా 150 టెస్టు మ్యాచ్‌లు ఆడి తొలి బౌలర్‌గా నయా రికార్డును నమోదు చేశాడు. ఓవరాల్‌గా తొమ్మిదో క్రికెటర్‌గా నిలిచాడు. అండర్సన్‌ కంటే ముందు 150, అంత కంటే ఎక్కువ టెస్టు మ్యాచ్‌లు ఆడిన జాబితాలో సచిన్‌ టెండూల్కర్‌ 200 మ్యాచులు ఆడాడు. ఇక రికీ పాంటింగ్‌ 168 , స్టీవ్‌ వా 168, జాక్వస్‌ కల్లిస్‌ 166 , శివ నారాయణ్‌ చందర్‌పాల్‌ 164, రాహుల్‌ ద్రవిడ్‌ 164, అలెస్టర్‌ కుక్‌ 161, అలెన్‌ బోర్డర్‌ 156లు ఉన్నారు. అయితే వీరంతా బ్యాట్స్‌మెన్‌లు కాగా, ఇప్పుడు వారి సరసన తొలి బౌలర్‌గా అండర్సన్‌ నిలిచాడు. దక్షిణాఫ్రికాతో టెస్టు మ్యాచ్‌ అండర్సన్‌కు ఇది 150వది.

తన 17 ఏళ్ల కెరీర్‌లో అండర్సన్‌ తరచుగా గాయాల బారిన పడుతూనే తన రీఎంట్రీలో ఫిట్‌నెస్‌ను ఘనంగా నిరూపించు కుంటూనే ఉన్నాడు. ఇలా గాయాల బారిన పడుతూ ఒక పేస్‌ బౌలర్‌ నిలదొక్కు కోవడం చాలా కష్టం. కానీ అండర్సన్‌ తన ఫిట్‌నెస్‌ విషయంలో నిరంతరం శ్రమిస్తూనే ఉన్నాడు. తన టెస్టు కెరీర్‌లో 576 వికెట్లను అండర్సన్‌ సాధించి నాల్గో స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్‌ తరఫున 500కి పైగా టెస్టు వికెట్లు సాధించిన ఏకైక బౌలర్‌ కూడా అండర్సన్‌ కావడం విశేషం. అత్యధిక టెస్టు మ్యాచ్‌లు ఆడిన బౌలర్లలో అండర్సన్‌ తర్వాత స్థానంలో షేన్‌ వార్న్‌ ఉన్నాడు. వార్న్‌ తన కెరీర్‌లో 145 టెస్టులు ఆడాడు. పేసర్ల విభాగంలో అండర్సన్‌ తర్వాత స్థానంలో స్టువర్ట్‌ బ్రాడ్‌ 135 , వాల్ష్‌ 132, కపిల్‌దేవ్‌ 131లు ఉన్నారు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!