కుర్రాళ్ళ ఆట అదుర్స్
ఈసారి మన క్రికెట్ ఆట మెరిసింది. ప్రపంచ క్రికెట్ కప్ టోర్నమెంట్ లో సెమీ ఫైనల్ లో చతికిల పడిన టీమిండియా ఆ తర్వాత జతన ఆట తీరును మరింత మెరుగు పరుచుకుంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ తమ బ్యాటింగ్ తో దుమ్ము రేపారు. టీమిండియా తన జైత్ర యాత్రను కొనసాగించింది. ప్రధానంగా టెస్టుల్లో సత్తాను చాటింది. ఇతర జట్లను మట్టి కరిపించింది. ఐసీసీ టెస్టు చాంపియన్‌లో భాగంగా పలు సిరీస్‌లను ఆడిన టీమిండియా ఒక్క సిరీస్‌ను కూడా కోల్పోలేదు. అసలు ఏ ఒక్క మ్యాచ్‌లోనూ ఓటమి చవి చూడ లేదు. వెస్టిండీస్ టూర్ లో టీమిండియా కరీబియన్లను క్లీన్ స్వీప్ చేసింది.
టీ20ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత్..ఆపై వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. అదే ఊపును రెండు టెస్టుల సిరీస్‌లో కూడా కొనసాగించింది. 120 పాయింట్లను ఖాతాలో వేసుకుంది. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను గెలుపొందింది. హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. మ్యాచ్‌కు 40 పాయింట్లు చొప్పున భారత్ మరో 120 పాయింట్లను సాధించింది. బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20ల సిరీస్‌ను టీమిండియా 2-1 గెలవగా, రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. 60 పాయింట్ల చొప్పున 120 పాయింట్లను దక్కించుకుంది.
ఓవరాల్‌గా 360 పాయింట్లతో టీమిండియా టాప్‌లో కొనసాగుతోంది. టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న టీమిండియా.. టెస్టు చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలోనూ ప్రథమ స్థానంలో నిలిచింది. మొత్తం మీద టీమునుండియే ఆటగాళ్లు అద్భుతమైన ఆట తీరును ప్రదర్శిస్తూ ఈసారి తమకు ఎదురే లేదని నిరూపించారు. మొత్తం మీద అన్ని ఫార్మాట్ లలో టీమిండియా ఆటగాళ్లు మెరిశారు. అంతకంటే ఎక్కువగా కెప్టెన్, వైస్ కెప్టెన్ కోహ్లీ, రోహిత్ శర్మలు దుమ్ము రేపగా కుర్రాళ్ళు మాత్రం తమ ఆట తీరుతో అభిమానుల మనసు దోచుకున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి