క్రియేటివిటికి పట్టం ..కళాకారులకు స్వర్గధామం ..ఆర్ట్‌బ్లోర్..!

తిన్నామా..పడుకున్నామా..తెల్లారిందా ఇదేనా లైఫ్ అంటే..కాదు..జీవితం అద్భుతం. ఒకే ఒక్కసారి వచ్చే ఈ అరుదైన అవకాశం ఇంకే జీవికి లేదు. సంగీతం..సాహిత్యం..ప్రకృతి ..ఆకాశం..ఇవ్వన్నీ ..జర్నీ ఇవన్నీ కలిస్తే..కొత్త ప్రపంచం ఆవిష్కృతమవుతుంది. లోకంలో లెక్కలేనంత టాలెంట్ వుంది. అద్భుతాలు సృష్టించే సృజనశీలురు కోట్లలో ఉన్నారు. బొమ్మలు గీసే వాళ్లు..తయారు చేసే వాళ్లు లెక్కలేనంత మంది. మన దేశంలో కళాకారులకు గుర్తింపు తక్కువ. కానీ ఇతర దేశాల్లో అయితే కళ్లకు అద్దుకుంటారు. అక్కడంతా కళాత్మకతకు పెద్దపీట వేస్తారు. పాలిటిక్స్‌ను అంతగా పట్టించుకోరు. ఎన్నికలప్పుడే ఆ తర్వాత వదిలేస్తారు. సంగీతానికి, పెయింటింగ్స్‌కు ..కవిత్వానికి..సమావేశాలకు ఇచ్చినంత ప్రయారిటీ ఇంకే దానికి ఇవ్వరు. పాలకులకంటే కళాకారులకే గౌరవం. ప్రపంచ వ్యాప్తంగా ఎందరో టాలెంట్ కలిగిన వారికి ఒక వేదిక తీసుకు వచ్చేందుకు ఆర్ట్‌బ్లోర్ కృషి చేస్తోంది. ఎక్కడున్నా ..ఏ మూలనున్నా సరే..కొంచెం క్రియేటివిటీకి ప్రాణం పోసి తమను తాము నిరూపించు కోగలిగితే చాలు. ఆర్టిస్టులందరికి ఒక ఫ్లాట్ ఫారంగా ఇది పనిచేస్తు...