క్రియేటివిటికి పట్టం ..కళాకారులకు స్వర్గధామం ..ఆర్ట్‌బ్లోర్..!
తిన్నామా..పడుకున్నామా..తెల్లారిందా ఇదేనా లైఫ్ అంటే..కాదు..జీవితం అద్భుతం. ఒకే ఒక్కసారి వచ్చే ఈ అరుదైన అవకాశం ఇంకే జీవికి లేదు. సంగీతం..సాహిత్యం..ప్రకృతి ..ఆకాశం..ఇవ్వన్నీ ..జర్నీ ఇవన్నీ కలిస్తే..కొత్త ప్రపంచం ఆవిష్కృతమవుతుంది. లోకంలో లెక్కలేనంత టాలెంట్ వుంది. అద్భుతాలు సృష్టించే సృజనశీలురు కోట్లలో ఉన్నారు. బొమ్మలు గీసే వాళ్లు..తయారు చేసే వాళ్లు లెక్కలేనంత మంది. మన దేశంలో కళాకారులకు గుర్తింపు తక్కువ. కానీ ఇతర దేశాల్లో అయితే కళ్లకు అద్దుకుంటారు. అక్కడంతా కళాత్మకతకు పెద్దపీట వేస్తారు. పాలిటిక్స్‌ను అంతగా పట్టించుకోరు. ఎన్నికలప్పుడే ఆ తర్వాత వదిలేస్తారు. సంగీతానికి, పెయింటింగ్స్‌కు ..కవిత్వానికి..సమావేశాలకు ఇచ్చినంత ప్రయారిటీ ఇంకే దానికి ఇవ్వరు. పాలకులకంటే కళాకారులకే గౌరవం.
ప్రపంచ వ్యాప్తంగా ఎందరో టాలెంట్ కలిగిన వారికి ఒక వేదిక తీసుకు వచ్చేందుకు ఆర్ట్‌బ్లోర్ కృషి చేస్తోంది. ఎక్కడున్నా ..ఏ మూలనున్నా సరే..కొంచెం క్రియేటివిటీకి ప్రాణం పోసి తమను తాము నిరూపించు కోగలిగితే చాలు. ఆర్టిస్టులందరికి ఒక ఫ్లాట్ ఫారంగా ఇది పనిచేస్తుంది. ఈ వెబ్ పోర్టల్‌లోకి వెళ్లి అక్కడ జాయిన్ అవుతే చాలు..మీరూ భాగస్వాములై పోతారు. లక్షలాది మంది మీతో అనుసంధానమవుతారు. మీ కలలకు రెక్కలు తొడిగినవన్నీ వారికి చేరి పోతాయి. ఒక వేళ మీరు రూపొందించిన లేదా తయారు చేసిన ఫోటోలు ఎవరైనా ఇష్టపడితే మీకు ఆఫర్ ఇస్తారు. మీతో నేరుగా మాట్లాడతారు. నచ్చితే మీ ఖాతాలోకి డబ్బులు జమ చేస్తారు. సంగీతకారులు, కవులు, రచయితలు, ఆర్టిస్టులు, పెయింటర్స్..ఇలా ప్రతి ఫ్రేంలోను ఫేమస్ అయిన వాళ్లు..ప్రాథమిక దశలో తమ టాలెంట్‌కు పదును పెట్టుకునే వాళ్లందరు ఇందులో సభ్యులే.
ఇలాంటి ఆలోచన రావడమే గొప్ప. ఎవరికి వారు తమ లోకంలో ఊరేగుతుంటే..వీళ్లు మాత్రం ఆర్టిస్టులకు విశ్వ వేదికను ఏర్పాటు చేశారు. ఎలాంటి ఫీజు అక్కర్లేదు. ఇంకెవ్వరి సిఫారసు పొందాల్సిన పనిలేదు. జస్ట్..ఓ మెయిల్ వుంటే చాలు..సైనప్ అవడం..మీ టాలెంట్‌ను ప్రదర్శించడం. ఒకరు కాదు వేలు కాదు లక్షలాది మంది ఆర్ట్ బ్లోర్‌లో చేరారు. రోజు రోజుకు ఇది మరింత పాపులర్ అవుతోంది. ఆకాశమంత టాలెంట్..అద్భుతమైన అవకాశాలు దీని ద్వారా ఆర్టిస్టులకు లభిస్తున్నాయి. ఒక దానికంటే ఇంకొకటి పెయింటింగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఆలోచింప చేసేలా ఉన్నాయి. ప్రతిభ వుండి ఛాన్సెస్ రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్న లోకల్ టాలెంట్ కళాకారులు ఆర్ట్ బ్లోర్‌ను నమ్ముకుంటే కొంత మేరకైనా అంతర్జాతీయ పరంగా మరింత పాపులర్ అయ్యే అవకాశం ఉంది. లైఫ్..సొసైటీ..జర్నీ..నేచర్..మ్యూజిక్..ఇలా ప్రతి ఫ్రేమ్‌కు సంబంధించిన పెయింటింగ్స్ లక్షల్లో నిక్షిప్తమై ఉన్నాయి. టెక్నాలజీకి క్రియేటివిటీ జోడిస్తూ ఏర్పాటు చేసిన ఈ ఆర్టిస్ట్స్ బ్లోర్ గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఆకట్టుకునేలా ..ఆలోచింప చేసేలా..గుండెల్లో భద్రంగా దాచుకునేలా తయారు చేసిన ఈ టీం సభ్యుల కృషికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. గూగుల్‌లోకి వెళ్లి ఆర్ట్ బ్లోర్ అని వెతికితే చాలు వేలాది ఫోటోలు ..పెయింటింగ్స్ ..కలర్ ఫుల్ గా కనిపిస్తాయి. సో..టాలెంట్ వుండీ నిరాశకు లోనవుతున్న ఆర్టిస్టులు ఎవ్వరైనా సరే ఇందులో చేరండి. ఎవరో ఒకరు మిమ్మల్ని..మీ పనితనాన్ని గుర్తించకపోరు. నిరాశను వదలండి..మీలోని ప్రతిభకు పదును పెట్టండి. కొంచెం కష్టపడితే ఇక్కడి నుంచే డాలర్లు పోగేసుకోవచ్చు..లైఫ్‌ను హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. మీదైన టాలెంట్..మీదైన లైఫ్..ఇంకెందుకు ఆలస్యం..జస్ట్ క్లిక్..అంతే..! కళ కళ కోసం కాదు..జనం కోసం. ప్రపంచాన్ని ఆవిష్కరించడం. కలల్ని కాన్వాస్ మీద బంధించడం. గుండెల్లో నిక్షిప్తమైన ప్రేమకు ప్రాణం పోయడం. కళ వర్ధిల్లాలి..కళాకారులు సూర్య చంద్రులున్నంత కాలం బతికే వుండాలి...!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి