తలైవాతో తీరిన కల

తమిళ సినీ అభిమానులు ప్రేమగా పిలుచుకునే తలైవా రజనీకాంత్ నటించిన దర్బార్ సందడి చేసేందుకు రెడీ అయ్యింది. ఈ మూవీని పాన్ డైరెక్టర్ మురుగదాస్ తెలుగు, తమిళ్, హిందీలలో తీశాడు. తాను అందరి లాగే రజనీకాంత్ ను చూసి పెరిగా. ఆయనతో సినిమా తీయాలన్న కోరిక అలాగే ఉండి పోయింది. ఇప్పుడు దర్బార్ తో తీరింది. దీని కోసం దాదాపు 15 ఏళ్ళు వేచి చూసా అని చెప్పారు డైరెక్టర్ మురుగదాస్. ఒకే కథతో వెళితే ఏం బావుంటుంది. అందుకే పలు కథలతో రజనీకాంత్ సర్ ఇంటికి వెళ్ళా. ఆయన ఒకే చెప్పారు. నాలో ఆనందం రెట్టింప్పయింది. అంతకు ముందు తలైవాతో సినిమాకు కాల్ రావడం నా జీవితంలో మరిచి పోలేను. ఇదే విషయం సినీ ఇండస్ట్రీలో వైరల్ అయ్యింది. నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి అభినందించారు. ఇంతకు ముందెప్పుడూ ఇలా జరగలేదు. తుది నరేషన్‌లోనూ సినిమా కుదరక పోవచ్చు. అలా జరగ కూడదనుకున్నాను. అందుకే ఏ మార్పు సూచించినా నాలుగైదు అషన్స్ ఉండేట్టు కథ తయారు చేసుకుని రజనీ సార్ దగ్గరకు వెళ్లాను అని మురుగదాస్ వెల్లడించారు. రజనీకాంత్, నయనతార జంటగా ఏఆర్ మురుగదాస్ దర్బార్ పేరుతో సినిమా తీశాడు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాను ఎన్వీ ప్రసాద్ తెలుగులో రిలీజ్...