ఎన్సీపీకి ముఖ్య పదవులు
మరాఠాలో కొత్తగా కొలువుతీరిన సంకీర్ణ సర్కారులో కీలక మంత్రి పదవులన్నీ శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ అభ్యర్థులకే లభించాయి. ఒఊహించని రీతిలో బీజేపీకి గుడ్ బై చెప్పిన శివసేన తో బద్ద శత్రువులైన కాంగ్రెస్ పార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా పావులు కదిపారు పవార్. అంతే కాదు ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ పార్టీలు కలిసేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇది దేశ రాజకీయాల్లో ఓ చరిత్రకు నంది పలికిందని చెప్పక తప్పదు. ఎందుకంటే ఓ వైపు దేశంలో అత్యంత బలీయమైన శక్తులుగా అవతరించారు ప్రధాని నరేంద్ర మోదీజీ, హోమ్ శాఖా మంత్రి అమిత్ చంద్ర షా. వీరిద్దరిని ఎదుర్కొని నిలబడటం, రాజకీయంగా పోరాడటం కష్టం. కానీ అసాధ్యమనుకున్న దానిని సుసాధ్యం చేశారు శరద్ పవార్.
మహారాష్ట్రలో మొదటి సారిగా ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన పార్టీ అధికారంలోకి వచ్చేలా చేసిన ఘనత మాత్రం ఈ రాజకీయ చాణిక్యుడిదే. అప్పుడో ఇప్పుడో అంటూ నెట్టుకుంటూ వస్తున్న ఈ సంకీర్ణ సర్కార్ ఐదేళ్లు పాలన సాగిస్తుందా అన్నది ఇప్పుడు చర్చకు దారితీసింది. అయినా ఎప్పుడూ కూల్ గా పాజిటివ్ దృక్పథంతో ఉండే ఉద్దవ్ సీఎం గా ఉంటారని శివసేన నాయకులూ, కార్యకర్తలు నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ప్రమాణ స్వీకారం చేసినా శాఖలు కేటాయించ లేదు. తాజాగా మహా వికాస్ ఆఘాడి ప్రభుత్వంలోని మంత్రులకు ఎట్టకేలకు శాఖలు కేటాయించారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సూచన మేరకు ఆయన ప్రతిపాదించిన మంత్రుల శాఖల జాబితాను గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ ఆమోదం తెలిపారు.
దీంతో కూటమి ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన శాఖల అప్పగింత అంకం ముగిసింది. ముందుగా ఊహించిన విధంగానే ఎన్సీపీ సీనియర్ నేత ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌కు కీలకమైన ఆర్థిక, ప్రణాళిక శాఖలను అప్పగించారు. అలాగే ఉద్ధవ్ కుమారుడు, ఆదిత్య ఠాక్రేకు పర్యవరణం, టూరిజం శాఖ దక్కింది. ఎన్సీపీ సీనియర్ నేత అనిల్ దేశ్‌ముఖ్‌కు హోంశాఖ, నవాబ్ మాలిక్ మైనార్టీ శాఖ, జయంత్ పాటిల్‌కు జలవనరులు శాఖ బాధ్యతలు అప్పగించారు. మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ చవాన్‌కు పబ్లిక్ వర్స్ దక్కింది. అయితే ప్రభుత్వంలో కీలక శాఖలన్నీ ఎన్సీపీకే దక్కినట్లు తెలుస్తోంది.
మంత్రివర్గ విస్తరణలో కొత్తగా 36 మందిని ఉద్ధవ్ ఠాక్రే తన మంత్రివర్గంలో చేర్చుకున్న విషయం తెలిసిందే. ఎన్సీపీ నుంచి 14 మంది, కాంగ్రెస్ నుంచి 10 మంది, శివసేన నుంచి 12 మంది మంత్రి పదవులు పొందారు. కాగా జనరల్ అడ్మినిస్ట్రేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ & పబ్లిక్ రిలేషన్స్, న్యాయశాఖ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే వద్ద ఉండగా, ఇక ఇతర మంత్రులకు శాఖలు కేటాయించాల్సి ఉంది. మొత్తం మీద నిన్నటి దాకా తలనొప్పిగా మారిన పదవుల పంపకం పూర్తి కావడంతో ఉద్దవ్ ఠాక్రే ఊపిరి పీల్చుకున్నారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి