తలైవాతో తీరిన కల

తమిళ సినీ అభిమానులు ప్రేమగా పిలుచుకునే తలైవా రజనీకాంత్ నటించిన దర్బార్ సందడి చేసేందుకు రెడీ అయ్యింది. ఈ మూవీని పాన్ డైరెక్టర్ మురుగదాస్ తెలుగు, తమిళ్, హిందీలలో తీశాడు. తాను అందరి లాగే రజనీకాంత్ ను చూసి పెరిగా. ఆయనతో సినిమా తీయాలన్న కోరిక అలాగే ఉండి పోయింది. ఇప్పుడు దర్బార్ తో తీరింది. దీని కోసం దాదాపు 15 ఏళ్ళు వేచి చూసా అని చెప్పారు డైరెక్టర్ మురుగదాస్. ఒకే కథతో వెళితే ఏం బావుంటుంది. అందుకే పలు కథలతో రజనీకాంత్ సర్ ఇంటికి వెళ్ళా. ఆయన ఒకే చెప్పారు. నాలో ఆనందం రెట్టింప్పయింది. అంతకు ముందు తలైవాతో సినిమాకు కాల్ రావడం నా జీవితంలో మరిచి పోలేను. ఇదే విషయం సినీ ఇండస్ట్రీలో వైరల్ అయ్యింది. నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి అభినందించారు.

ఇంతకు ముందెప్పుడూ ఇలా జరగలేదు. తుది నరేషన్‌లోనూ సినిమా కుదరక పోవచ్చు. అలా జరగ కూడదనుకున్నాను. అందుకే ఏ మార్పు సూచించినా నాలుగైదు అషన్స్ ఉండేట్టు కథ తయారు చేసుకుని రజనీ సార్‌ దగ్గరకు వెళ్లాను అని మురుగదాస్‌ వెల్లడించారు. రజనీకాంత్, నయనతార జంటగా ఏఆర్‌ మురుగదాస్‌ దర్బార్‌ పేరుతో సినిమా తీశాడు. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించిన ఈ సినిమాను ఎన్వీ ప్రసాద్‌ తెలుగులో రిలీజ్‌ చేస్తున్నారు. ఆయన తన అనుభవాలను పంచుకున్నారు. చెన్నైకి 200 కిలోమీటర్ల దూరంలో మా ఊరు. అక్కడ కేవలం 2 థియేటర్స్‌ ఉండేవి. చిన్నప్పుడు అమ్మతో కలసి రజనీ గారి సినిమా చూశాను. ఆయనది కూడా ఈ ఊరే. థియేటర్‌లో ఉంటారు అనుకునే వాణ్ణి.

ఓసారి అక్క వాళ్ల ఇంటికి వెళ్తే  ఆ ఊరి థియేటర్‌లోనూ ఉన్నారు. రజనీ గారిది మన ఊరు కదా ఇక్కడికి ఎలా వచ్చారు అని నాకు డౌట్‌ వచ్చింది. అది సినిమా, ఆయన నటుడు అని వివరించి చెప్పారు మా అక్క. నా 5వ తరగతిలో చెన్నై టూర్‌ వెళ్లాను. చెన్నైలో రజనీ సార్‌ ఎక్కడ అని చూస్తూ ఉండేవాణ్ణి. ఆ తర్వాత  అసిస్టెంట్‌ దర్శకుడిగా ఉన్నప్పుడు ఆయనను దూరంగా నిలుచుని తదేకంగా చూశాను. గజిని అప్పుడు డైరెక్ట్‌గా కలిసే అవకాశం వచ్చింది. ఈ మూవీ రిలీజ్‌ అయ్యాక తలైవా ఫోన్‌ చేశారు. తమిళంలో మంచి సినిమా రిలీజ్‌ అయితే అభినందించడం ఆయనకు అలవాటు. ఆ టీమ్‌తో సంభాషిస్తారు. గజని సక్సెస్ తో నాకు ఆ ఛాన్స్ దొరికింది.

ఆయన శివాజీ చేస్తున్న సమయంలో మేం కలిసి సినిమా చేయాలనుకున్నాం. అప్పుడు గజిని హిందీ రీమేక్‌తో నేను, రోబో తో ఆయన బిజీగా ఉన్నాం. ఏడాదిన్నర క్రితం మళ్లీ సినిమా చేయాలనుకున్నాం. ఈసారి అవకాశం మిస్‌ అవ్వ కూడదు అనుకున్నాను. రజనీకాంత్‌ గారిని నేను ఎలా చూడాలనుకుంటున్నానో, ఆయన్ను స్క్రీన్‌ మీద చూసి ఎలా ఎంజాయ్‌ చేశానో అది ఈ జనరేషన్‌ వాళ్లకు కూడా కనెక్ట్‌ అయ్యేలా దర్బార్‌ లో చూపించాను. ముంబై బ్యాక్‌ డ్రాప్‌లో సాగే పోలీస్‌ కథ ఇది. సమాజంలో జరిగే అన్యాయాలకు తనదైన శైలిలో న్యాయం చేసే స్టోరీ. ఇందులో ఫ్యాన్స్‌ ఆయన్నుంచి ఆశించే మేనరిజమ్స్, స్టయిల్స్‌ అన్నీ ఉంటాయి. రజనీ గారితో ఈ ప్రయాణంలో చాలా తెలుసుకున్నాను. దేవుడి గురించి ఆయన చాలా విషయాలు చెప్పారు. నాకో పుస్తకం కూడా ఇచ్చారు.

సినిమా అనేది చాలా పవర్‌ఫుల్‌ మీడియా. సినిమా కేవలం వినోదంగానే  ఉండకూడదని నా అభిప్రాయం. అందుకే సందేశం ఇవ్వాలనుకుంటాను. ఆ సందేశం వల్ల ఒక్క రాత్రిలో జనాలు మారిపోతారని కాదు.  కానీ ఓ ఆలోచన కలుగుతుంది. మెల్లగా తెలుసుకుంటారు. కమర్షియల్‌ సినిమాలో, పెద్ద హీరోల సినిమాల్లో సందేశం జోడిస్తే ఇంకా ఎక్కువ మందికి చేరుతుందన్నది నా ఒపీనియన్. మేల్‌ డామినేటెడ్‌ ఇండస్ట్రీలో ఒక సూపర్‌ స్టార్‌గా ఎదిగిన అమ్మాయి నయనతార. ఆమె ఎదుగుదలను మనం గౌరవించాలి. చాలా గ్యాప్‌ తర్వాత నయనతార, రజనీ సార్‌ కలసి యాక్ట్‌ చేశారు. అనిరుధ్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ బాగా ఇచ్చాడు. తెలుగులో స్ట్రయిట్‌గా నేను తీసిన సినిమాలు సరిగ్గా ఆడలేదు. స్టార్‌డమ్‌ను అంచనా వేయడం లోనో ఇంకేదో విషయం లోనో మిస్‌ అయ్యాను. మహేశ్‌బాబు లాంటి సూపర్‌స్టార్, కష్టపడే హీరోకు హిట్‌ ఇవ్వలేదని బాధ పడ్డాను అన్నారు మురుగదాస్. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!