విజయం మీదే భారం
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో విజయం మనదే. ఇక మెజారిటీ మీదే మనం దృష్టి పెట్టాలి. ఇప్పటికే సర్వేలు కూడా ఇదే విషయాన్నీ స్పష్టం చేశాయి కూడా. మొత్తం మున్సిపాల్టీలు, కార్పొరేషన్స్ లలో గులాబీ జెండాలు ఎగరాల్సిందే. లేకుంటే మంత్రులు తమ పదవులు పోవడం మాత్రం ఖాయం. ఇక పార్టీ పరంగా కూడా మీకంటూ ఓ ప్లేస్ కూడా ఉండదన్న విషయం గుర్తించాలని సీరియస్ వర్కింగ్ ఇచ్చారు గులాబీ బాస్. మున్సిపల్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో అధికార టీఆర్‌ఎస్ పార్టీ దూకుడు పెంచింది. తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం పాల్గొన్నారు. ఈ మేరకు కేసీఆర్ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు.
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సర్వ్ ఏజెన్సీలన్నీ అధికార పార్టీకే అన్నీ అని తెలిపాయన్నారు. మొత్తం రాష్ట్రంలో ఉన్న120 మున్సిపాలిటీలు,10 కార్పొరేషన్‌లలో మనమే గెలుస్తున్నాం. బీజేపీ మనకు పోటీ అనే అపోహలు వద్దు. మనకు ఎవరితో పోటీ లేదు. పాత, కొత్త నాయకులు సమన్వయంతో పని చేయాలి. పార్టీ ఒకసారి అభ్యర్థిని ఫైనల్ చేసిన తర్వాత ఆ అభ్యర్థి గెలుపు కోసమే పని చెయ్యాలి. అవసరం ఉన్న చోట మంత్రులు ఎన్నికల ప్రచారం చేస్తారు. టికెట్ల పంపిణీ, రెబల్స్ బుజ్జగింపులు అన్నీ ఎమ్మెల్యేలదే బాధ్యత అని కేసీఆర్ స్పష్టం చేశారు.
పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ వార్నింగ్ ఇవ్వడంతో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులలో గుబులు రేపింది. మున్సిపల్ ఎన్నికలు వీరి పాలిట శాపంగా మారాయి. ఇప్పుడు గెలుపు గుర్రాల కోసం వేట మొదలైంది. ఎలాగైనా సరే గెలిపించుకుని రావాలని అల్టిమేటం ఇచ్చారు. పార్టీ భవన్ లో ఎన్నికలకు సంబంధించిన ప్రచార సామగ్రి సిద్ధం చేసి ఉంచారు. మొత్తం మీద టిఆర్ఎస్ నాయకులకు అతిపెద్ద టార్గెట్ నిర్దేశించారు అధినేత. అయితే పార్టీలో ఉన్న పాత నేతలకు ఇటీవలే అధికార పార్టీలో చేరిన ఇతర పార్టీలకు చెందిన నేతల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. మరి ఎవరికి టికెట్లు దక్కుతాయనేది టెన్షన్ నెలకొంది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి