అడిడాస్ ను దాటేసిన డెకత్ లాన్ ..!

ప్రపంచ స్పోర్ట్స్ షూస్ మార్కెట్ రంగంలో నిన్నటి దాకా రారాజుగా వెలుగొందాయి ప్రముఖ షూస్ కంపెనీలు అడిడాస్ , నైక్ లు. కానీ అనుకోని రీతిలో మార్కెట్ రంగంలో సునామీలా దూసుకు వచ్చింది డెకత్ లాన్ షూస్ కంపెనీ. రిటైలింగ్ బిజినెస్ లో భారీ అమ్మకాలు సాగిస్తోంది. ఇప్పటికే వ్యాపార పరంగా టాప్ రేంజ్ లో ఉన్న కంపెనీలను ఎప్పుడో దాటేసింది. గత ఏడాది నుంచి డెకత్ లాన్ కంపెనీ తయారు చేసిన షూస్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. తక్కువ ధరలతో పాటు నాణ్యవంతమైనవిగా ఉండేలా వీటిని, సరికొత్త డిజైన్లతో రూపొందించింది ఈ కంపెనీ. కొన్నేళ్లుగా స్పోర్ట్స్ పరంగా రాజ్యమేలుతూ వస్తున్నాయి ఆడి డాడ్ , నైక్ కంపెనీలు. ప్రపంచ మంతటా ప్రధానమైన పట్టణాలు, నగరాలలో డెకత్ లాన్ కంపెనీ షూస్ మాల్స్, స్టోర్స్, వేర్ హౌజెస్ ను ఏర్పాటు చేసింది. మిగతా కంపెనీలకంటే ధరల్లో 30 శాతానికి పైగా డిస్కౌంట్ లభించడం తో పాటు క్వాలిటీ లో ఎక్కడా కాంప్రమైజ్ కాక పోవడంతో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఆసియా లో బిగ్ మార్కెట్ వాటా కలిగిన ముంబైలో డెకత్ లాన్ తన స్టోర్స్ ను ప్రారంభించింది. భారతీయుల్లో నరనరాన జీర్ణించుకున్న ఆట ఏదైనా ఉందంటే అది క్రికెట్ ఒక్కటే.ఆటగాళ్ల...