జెరోమ్ గరం గరం..సాహూపై ఆగ్రహం..!

ఇప్పటికే పాన్ ఇండియా సూపర్ స్టార్ గా పేరొందిన, డార్లింగ్ ప్రభాస్ నటించిన సాహో సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. అయితే ఇంకా దీనిపై విమర్శలు వస్తూనే వున్నాయి. కానీ వసూళ్ల పరంగా చూస్తే బాక్సాఫీస్ లు బద్దలు కొడుతోంది. దాదాపు 375 కోట్లకు పైగా ఈ సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్ సుజిత్ రెడ్డి. కేవలం ఒకే ఒక్క సినిమాను తీశాడు. బాహుబలి బిగ్ హిట్ తర్వాత ప్రభాస్ రెండు ఏళ్ళు ఈ సినిమా కోసం ఆగాడు. తన స్టామినాకు , తన రేంజ్ కు తగ్గట్టు సినిమా ఉండేలా చూసుకున్నాడు. సాహో ప్రారంభం నుంచే సెన్సేషన్ సృష్టించింది. డిఫరెంట్ గా ఉండేలా హాలీవుడ్ స్థాయిని తలపించేలా సాహో ను తీశాడు సుజిత్. 

ఇదే సమయంలో బాలీవుడ్ లో టాప్ రేంజ్ లో ఉన్న శ్రద్దా కపూర్ ను తీసుకున్నారు. ఆమెకు దాదాపు భారీ ఫీజు చెల్లించినట్టు సినీ వర్గాల భోగట్టా . ఇక ప్రభాస్ ఇండియాలో ఏ హీరో తీసుకోనంత రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. ప్రీ రిలీజ్  ఫంక్షన్ గ్రాండ్ గా జరిగింది. ప్రతిదీ రిచ్ గా ఉండేలా ప్లాన్ చేశారు నిర్మాతలు. ఇందులో ఎక్కడా రాజీ పడలేదు. సినిమా మొత్తం డార్లింగ్ ప్రభాస్ దే. సినిమా ప్రమోషన్ నుంచి రిలీజ్ దాకా ..అంతా తానే అయి ముందుకు నడిపించాడు. అయితే ఈ సినిమా మొత్తం తాను తీసిన సినిమాకు కాపీ అంటూ ప్రముఖ ఫ్రెంచ్ దర్శకుడు జెరోమ్ సల్లే తీవ్ర ఆరోపణలు చేశాడు. 

అంతకు ముందు డైరెక్టర్ త్రివిక్రమ్ తీసిన అజ్ఞాతవాసి సినిమా, తాను తీసిన సినిమాకు ప్రేరణ అంటూ కామెంట్స్ చేశాడు. అవి అప్పట్లో సంచలనం  రేపాయి. ఇదే సమయంలో తాను తీసిన లార్గో వించ్ సినిమాను ప్రీమేక్  తీశారంటూ ట్వీట్ చేసాడు జెరోమ్. ఈ విషయంపై సుజీత్ రెడ్డి , ప్రభాస్ , నిర్మాతలు ఇంకా స్పందించ లేదు. మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా సాహో సినిమాకు పెద్ద ఎత్తున వసూళ్లు వస్తున్నాయి. ఇండియా తో పాటు ఓవర్ సీస్ లో డాలర్ల పంట పండుతోంది. బాహుబలి అంత హిట్ టాక్ తెచ్చుకోక పోయినప్పటికీ,  వసూళ్ల పరంగా అయితే రికార్డ్ లు తిరగ రాస్తోంది. ఇప్పటి వరకు 200 కోట్లు వసూలు చేసిందంటూ నిర్మాతలు వెల్లడించారు. 

కామెంట్‌లు