!..అరుదైన నటుడు..అద్భుత నాయకుడు..జయహో జనసేనాని..!
తెలుగు సినిమా రంగంలో కామ్ గా ఎంటర్ అయి ..సునామీలా సెన్సేషన్ సృష్టించిన ఒకే ఒక్కడు ..అరుదైన నటుడు..కొణిదెల పవన్ కళ్యాణ్. ఈ స్టార్ కు ఇప్పుడు 58 ఏళ్ళు. మొదటి నుంచి సినిమా రంగంలో తనవారు ఉన్నప్పటికీ, తనకంటూ ప్రత్యేకతను, బ్రాండ్ ను , ఇమేజ్ ను స్వంతం చేసుకున్న యాక్టర్. ఓ సామాన్యమైన, మధ్యతరగతి పోలీస్ కానిస్టేబుల్ కుటుంబంలోంచి వచ్చిన పవన్ ..స్వశక్తితో ఎదిగారు. అంచెలంచెలుగా టాప్ పొజిషన్ లోకి చేరుకున్నాడు. పవన్ కళ్యాణ్ తనను తాను నటుడిగా ప్రూవ్ చేసుకున్నారు. అంతే కాకుండా అంతర్ముఖుడైన ఆయనకు, ప్రపంచాన్ని నిత్యం ప్రభావితం చేస్తూ, కోట్లాది ప్రజలు నిత్యం స్మరించుకునే చేగువేరా అంటే వల్లమాలిన అభిమానం.
పుస్తకాలంటే చచ్చేంత ఇష్టం. నటుడిగా ఎదిగిన ఆయన అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారు. జనం కోసం జనసేన పార్టీ స్థాపించారు. ప్రజా నాయకుడిగా ఎదిగారు. ఎన్నో ఆరోపణలు, విమర్శలు చేసినా తట్టుకుని నిలబడ్డారు. సమస్యలను ప్రస్తావించడంతో పాటు ప్రజల పక్షాన పోరాడుతున్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే ఇంకో వైపు పాలిటిక్స్ లో ఫుల్ టైమర్ గా ఉన్నారు. నటుడిగా, నిర్మాతగా, యుద్ధ కళలో ఎక్స్ పర్ట్ గా , దర్శకుడిగా , రచయితగా , రాజకీయ వేత్తగా పేరు తెచ్చుకున్నారు. తన అన్నయ్య చిరంజీవిని చూసి స్ఫూర్తి పొందారు. నటన పట్ల ఆసక్తిని పెంచుకున్నారు. 1996 లో అక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి సినిమా ద్వారా తెలుగు సినీ రంగంలోకి ప్రవేశించాడు. గబ్బర్ సింగ్ సినిమాకు ఉత్తమ నటునిగా ఫిలింఫెర్ అవార్డు అందుకున్నారు.
పవన్ కు త్రివిక్రమ్ అంటే అభిమానం. అత్తారింటికి దారేది సినిమా వసూళ్ళలో రికార్డ్ లు బ్రేక్ చేసింది. ఇప్పటికీ ప్రతి వారం బుల్లితెర మీద టెలికాస్ట్ అవుతూనే ఉన్నది. అంజనా ప్రొడక్షన్స్ , పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లతో సినిమాలు నిర్మిస్తున్నారు. సమకాలీన నటులకంటే ఆయన కొంచెం డిఫరెంట్. తన అన్న నటించిన కొన్ని సినిమాలకు ఫైట్ సన్నివేశాలు ఉండేలా తీర్చిదిద్దాడు. పవన్ కు మార్షల్ ఆర్ట్స్ లో మంచి పట్టుంది. కొన్ని సినిమాల్లో పాటలు కూడా పాడారు. బద్రి బంపర్ హిట్ . ఇలాంటి సినిమాలు ఎన్నో. ఎక్కువగా పుస్తకాలు చదివే అలవాటు ఉన్న ఈ నటుడు ఏది మాట్లాడినా అదో సంచలనం. లక్షలాది మంది అభిమానులను స్వంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరుకుందాం.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి