గవర్నర్ల మార్పు దత్తన్నకు ప్రమోషన్ ..తెలంగాణకు సౌందర రాజన్

ఊహించిందే జరిగింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అయిదు రాష్ట్రాలకు కొత్తగా గవర్నర్లను నియమించింది. గత కొంత కాలంగా మార్పు జరుగుతుందన్న వార్తలు వచ్చాయి. తెలంగాణ గరవ్నర్ గా మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్న విద్యాసాగర్ రావు వస్తారని అనుకున్నారు బీజేపీ శ్రేణులు. కానీ పార్టీ ఎందుకనో ఆయన పదవీ కాలాన్ని పొడిగించలేదు. రాబోయే కాలంలో తెలంగాణాలో పాగా వేయాలంటే బలమైన నాయకుడు కావాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ లాంటి లీడర్ ను తట్టుకుని నిలబడాలంటే ..అందుకు ధీటైన నేత ఆ పార్టీకి కావాలి.

ఇక ఏపీకి ఇటీవలే గవర్నర్ ను నియమించింది సర్కార్. అప్పుడే తెలంగాణ లో కూడా చేంజ్ ఉంటుందనుకున్నారు. సుదీర్ఘ కాలం పాటు ఉమ్మడి ఏపీకి గవర్నర్ గా ఉన్నారు నరసింహ్మన్ . తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు, ఏపీ తెలంగాణ ల మధ్య నెలకొన్న సమస్యలను ఆయన దగ్గరుండి పరిష్కరించారు. అంతే కాకుండా అన్ని పార్టీల నాయకులను ఆదరించారు. ఇక్కడి సంస్కృతి అంటే గవర్నర్ దంపతులకు ఇష్టం. పలు దేవాలయాల అభివృద్ధికి , విద్యా, వైద్యం మెరుగు పడేలా చేశారు. అప్పట్లో కేసీఆర్ కు సపోర్ట్ గా ఉన్నారంటూ ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు  చేశాయి. అయినా ఎలాంటి మార్పు జరగలేదు.

కానీ ఉన్నట్టుండి కేంద్ర సర్కార్ సడన్ గా డిసిషన్ తీసుకున్నది. రాబోయే కాలంలో పవర్ లోకి రావాలన్న ధ్యేయంతో పావులు కదుపుతోంది బీజేపీ. ఇక మంత్రి పదవి కోల్పోయిన బండారు దత్తాత్రేయ కు పదోన్నతి లభించింది. ఆయనను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా నియమించింది. ఇక తమిళ నాడు కు చెందిన సౌందర్ రాజన్ ను తెలంగాణకు గవర్నర్ గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. కల్రాజ్ మిశ్రాకు రాజస్థాన్, మహారాష్ట్రకు భగత్ సింగ్ కోశ్యారి, కేరళకు ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ను కేరళ రాష్ట్రాలకు గరవ్నర్ లుగా నియమించింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!