అడిడాస్ ను దాటేసిన డెకత్ లాన్ ..!
ప్రపంచ స్పోర్ట్స్ షూస్ మార్కెట్ రంగంలో నిన్నటి దాకా రారాజుగా వెలుగొందాయి ప్రముఖ షూస్ కంపెనీలు అడిడాస్ , నైక్ లు. కానీ అనుకోని రీతిలో మార్కెట్ రంగంలో సునామీలా దూసుకు వచ్చింది డెకత్ లాన్ షూస్ కంపెనీ. రిటైలింగ్ బిజినెస్ లో భారీ అమ్మకాలు సాగిస్తోంది. ఇప్పటికే వ్యాపార పరంగా టాప్ రేంజ్ లో ఉన్న కంపెనీలను ఎప్పుడో దాటేసింది. గత ఏడాది నుంచి డెకత్ లాన్ కంపెనీ తయారు చేసిన షూస్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. తక్కువ ధరలతో పాటు నాణ్యవంతమైనవిగా ఉండేలా వీటిని, సరికొత్త డిజైన్లతో రూపొందించింది ఈ కంపెనీ.
కొన్నేళ్లుగా స్పోర్ట్స్ పరంగా రాజ్యమేలుతూ వస్తున్నాయి ఆడి డాడ్ , నైక్ కంపెనీలు. ప్రపంచ మంతటా ప్రధానమైన పట్టణాలు, నగరాలలో డెకత్ లాన్ కంపెనీ షూస్ మాల్స్, స్టోర్స్, వేర్ హౌజెస్ ను ఏర్పాటు చేసింది. మిగతా కంపెనీలకంటే ధరల్లో 30 శాతానికి పైగా డిస్కౌంట్ లభించడం తో పాటు క్వాలిటీ లో ఎక్కడా కాంప్రమైజ్ కాక పోవడంతో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఆసియా లో బిగ్ మార్కెట్ వాటా కలిగిన ముంబైలో డెకత్ లాన్ తన స్టోర్స్ ను ప్రారంభించింది. భారతీయుల్లో నరనరాన జీర్ణించుకున్న ఆట ఏదైనా ఉందంటే అది క్రికెట్ ఒక్కటే.ఆటగాళ్లు సైతం డెకత్ లాన్ షూస్ వాడుతుండడంతో అభిమానులు ఎక్కువగా వీటి మీదే పడ్డారు. సేల్స్ అమాంతం పెరిగాయి.
గత ఏడాది డెకత్ లాన్ కంపెనీ 1278 కోట్ల టర్నోవర్ సాధించింది. రిటైల్ రంగంలో షియోమీ తర్వాత డెకత్ లాన్ కంపెనీ రెండో స్థానంలో నిలిచింది. 2016 - 2017 లో సదరు కంపెనీ 53 కోట్ల రూపాయల నష్టంతో ముగించింది. కానీ ఉన్నట్టుండి ఈ ఏడాది సగానికల్లా మిగతా కంపెనీలు విస్తు పోయేలా అమ్మకాల్లో రికార్డ్ బ్రేక్ చేసింది. క్రికెట్ , ఫుట్ బాల్, వాలీబాల్ , బ్యాడ్మింటన్ , రన్నింగ్ రేస్ , టేబుల్ టెన్నిస్ ,హాకీ , కబడ్డీ లాంటి ఆటగాళ్లు ఇప్పుడు ఈ కంపెనీ షూస్ వాడుతున్నారు. అమ్మకాలు పెరగడంతో కంపెనీ స్వయంగా భారీ వేర్ హౌసెస్ ను ఏర్పాటు చేసింది. షూస్ లలో 500 ప్రోడక్ట్స్ ను ఇంట్రడ్యూస్ చేసింది డెకత్ లాన్. మొత్తం మీద అడిడాస్ , నైక్ కంపెనీలకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. ప్రాఫిట్ కావాలంటే ఈ కంపెనీని చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది కదూ .

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి