యాయిరే ..యాయిరే..రంగీలా..రే..!

తెలుగువాడి దమ్ము ఏమిటో..టాలెంట్ ఏమిటో..క్రియేటివిటీ అంటే ఎలా వుంటుందో ప్రపంచానికి తెలియ చెప్పిన ఒకే ఒక్కడు రాం గోపాల్ వర్మ. శివ సినిమాతో తెలుగు సినిమా రంగాన్ని కొత్త పుంతలు తొక్కించిన ఈ దర్శకుడి దెబ్బకు ఒక్కసారిగా హిందీ సినిమా కుదుపులకు లోనైంది. జాతి యావత్తు మొదటిసారిగా ..మెయిన్ స్ట్రీమ్‌లో తీసిన ఈ మూవీ కొత్త రికార్డులను తిరగ రాసింది. ఒకే మూస ధోరణికి అలవాటు పడిన సినీ ప్రేక్షకులను ముఖ్యంగా ముంబయిని రఫ్ఫాడించింది. వసూళ్లలో బాక్సాఫిస్ బద్దలు కొట్టింది. కోట్లు కుమ్మరించేలా చేసింది. కంటెంట్ పరంగా ..స్క్రీన్ ప్లే పరంగా..మ్యూజిక్ పరంగా ఎంతో ఉన్నత స్థాయికి తీసుకు వెళ్లిన ఘనత ఒన్ అండ్ ఓన్లీ డైనమిక్ డైరెక్టర్ వర్మకే దక్కుతుంది. తన సంగీతంతో మెస్మరైజ్ చేసిన ఘనత అల్లా రఖా రెహమాన్ మొదటిసారిగా హిందీ సినిమా రంగంలోకి ప్రవేశించారు. తన పవర్ ఏమిటో ఇండియన్స్‌కు తెలియ చెప్పారు. హీరోయిజం ..మేనరిజం చట్రంలో ఇరుక్కు పోయిన హీరో, హీరోయిన్లను మాస్ వరకు తీసుకు పోయాడు. ముంబయిని ఏకఛత్రాధిపత్యంతో ఏలుతున్న సినీ దిగ్గజాలను కోలుకోలేకుండా చేశాడు వర్మ...