స్టార్ టీవీకి జాక్ పాట్ - ఇండియా పాక్ మ్యాచ్‌కు 100 కోట్ల ఆదాయం

ప్రపంచాన్ని ఊపేస్తూ..ఆశ్చర్య పోయేలా చేస్తూ..కోట్లాది ప్రజల గుండెల్ని లయబద్ధంగా మార్చేసే సన్నివేశం ఏదైనా వుందంటే అది క్రికెట్ ఒక్కటే. అమెరికా లాంటి పెద్దన్న లాంటి దేశమే ఈ ఆటకున్న క్రేజ్ చూసి నివ్వెర పోతోంది. ఎందుకింత క్రేజ్ వుందో తెలుసుకోమని ఏకంగా తన క్రీడా నిపుణులను ఆదేశించిందంటే దానికున్న డిమాండ్ ఏమిటో అర్థమవుతుంది. అన్ని దేశాలు ఆడడం మామూలే. కానీ దాయాదులైన పాకిస్తాన్ , ఇండియా క్రికెట్ జట్ల మధ్య జరిగే ఏ మ్యాచ్ అయినా అది తీవ్ర ఉత్కంఠకు గురి చేస్తుంది. కోట్లాది భారతీయులే కాదు లక్షలాది పాకిస్తానీయులు కూడా కళ్లప్పగించి చూస్తారు. నిద్రహారాలు మాని ఏం జరగబోతుందో అంచనాలు, చర్చోప చర్చలు జరుగుతుంటాయి. మ్యాచ్ జరిగే వారం రోజుల కిందటి నుంచే వరల్డ్ వైడ్‌గా భారీ ఎత్తున బెట్టింగ్‌లు జోరందుకుంటాయి. కోట్లాది రూపాయలకు పైగా బెట్టింగ్ ఉంటుందని క్రికెట్ వర్గాలే అంగీకరిస్తున్నాయి. ఆక్టోపస్ లాగా ఈ క్రికెట్ ఆట పేరుకు పోయింది. చాప కింద నీరులా ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ కప్ టోర్నమెంట్ జరుగుతోంది. ఇంగ్లండ్‌లో జరుగుత...