మీషూ స్టార్టప్‌కు ఎఫ్‌బీ బిగ్ ఆఫర్
ప్రపంచంలోని సామాజిక మాధ్యమాల్లో టాప్ పొజిషన్‌లో ఉన్న అమెరికన్ కు చెందిన ఫేస్ బుక్ ఇండియాలోని బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న మీషూ స్టార్టప్ కంపెనీలో పెట్టుబడులు పెట్టనుంది. ఈ మేరకు బిగ్ ఆఫర్ ను ప్రకటించింది. ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నామన్నది ఆ సంస్థ ప్రకటించలేదు. ఎఫ్ బీ పరంగా చూస్తే ఇది రెండో కంపెనీ. రీ సెల్లర్స్, ఎస్ఎంబీలు, మైక్రో ఆంట్రప్రెన్యూనర్స్ కలుపుతూ ఇండియా వ్యాప్తంగా సంస్థ ను విస్తరించేలా చేశారు. సోషల్ మీడియా ద్వారా బయ్యర్స్ ను ఆకట్టు కోవడం. అమ్మకాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చు కోవడం.
ఇదంతా సామాజిక మాధ్యమాలతో అనుసంధానమై కొద్ది కాలంలోనే లాభాల పట్టాలెక్కింది మీషూ. మీషూ కంపెనీ మీద తమకు నమ్మకం ఉందని, అందుకే ఈ స్టార్టప్‌లో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చినట్లు ఫేస్ బుక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కమ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మోహన్ వెల్లడించారు. 2014 జూలైలో లిటిల్ ఐ ల్యాబ్స్ కంపెనీలో ఇంతకు ముందు పెట్టుబడి పెట్టింది ఈ సంస్థ. ఆండ్రాయిడ్ యాప్స్‌ను డెవలప్ చేసేందుకు న్యూ సాఫ్ట్ వేర్ టూల్‌ను క్రియేట్ చేసింది. 10 నుంచి 15 మిలియన్లను ఇన్వెస్ట్ చేసింది.
ఫ్యూయల్ బిజినెస్ పరంగా ఉద్యోగాల కల్పన మీషూ ద్వారా జరుగుతుందని అంచనా. ఫిమేల్స్ ఆంట్రప్రెన్యూర్స్‌గా ఎదిగేందుకు దోహద పడుతుంది. ఇది మంచి పరిణామం.
ఐఐటీ డిల్లీ గ్రాడ్యూయేట్స్ విదిత్ ఆత్రే, సంజీవ్ బార్న్‌వాల్‌లు మీషూ స్టార్టప్‌ను స్టార్ట్ చేశారు. మార్కెట్ రంగంలో కొత్తగా ఎలా వ్యాపారం చేయాలో, ఎలా ఆదాయాన్ని సమకూర్చు కోవాలో కొన్ని టూల్స్‌ను డెవలప్ చేశారు. మార్కెట్ స్ట్రాటజీని నిశితంగా పరిశీలించారు. రీ సెల్లర్స్, స్మాల్ అండ్ మీడియం బిజినెసెస్, మైక్రో ఆంట్రప్రెన్యూనర్స్ ను కనెక్ట్ చేస్తే చాలు..ఇందు కోసం సోషల్ మీడియా వాహకంగా ఉపయోగ పడుతుందని నమ్మారు.
ఆ దిశగా ప్లాన్ చేశారు. అది రియల్‌గా వర్కవుట్ అయింది. మీషూ ఐడియా మెట్రో సిటీలను దాటుకుని ఇతర నగరాలకు విస్తరించింది. 2 మిలియన్ల రీ సెల్లర్స్ దీని ద్వారా నమోదయ్యారు. ఫ్యూల్లింగ్ ఫిమేల్ ఆంట్రప్రెన్యూర్‌షిప్ కు ప్రయారిటీ పెరిగింది. 80 శాతానికి పైగా ఇందులో మహిళలే ఉండడం విశేషం. ఫేస్ బుక్ ఎంత పెట్టుబడి పెట్టిందనేది ఆఫ్ ద రికార్డ్. ఏది ఏమైనా ఎఫ్‌బీ ఇన్వెస్ట్ వల్ల వ్యాపారం మరింత విస్తరించేందుకు వీలు కలుగుతుంది. తద్వారా జీవనోపాధి లభిస్తుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి