ప్ర‌జా నాయ‌కా..జ‌గ‌న్మోహ‌నా..జ‌య‌హో

అవ‌మానాలు ఎదుర్కొని..ఆర్థిక నేరాల కేసుల్లో జైలుపాలై..తిరిగి ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చి..అధికార పీఠం ఎక్కిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర రెండ‌వ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన వైఎస్ఆర్‌సీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌జా రంజ‌క పాల‌న సాగిస్తున్నారు. మూడు సంవ‌త్స‌రాల పాటు అలుపెరుగ‌కుండా ప్ర‌జా యాత్ర పేరుతో పాద‌యాత్ర చేప‌ట్టారు. తండ్రి మ‌ర‌ణం స‌మ‌యంలో సంయ‌మ‌నం కోల్పోని ఈ యువ‌నాయ‌కుడు తిరిగి ప్ర‌జా నేత‌గా ప‌రిణితి చెంద‌డానికి కొన్నేళ్లు ప‌ట్టింది. అయినా అలసి పోలేదు. వెన‌క్కి తిరిగి చూడ‌లేదు. ప‌క్కా ప్ర‌ణాళిక‌తో దూకుడు ప్ర‌ద‌ర్శించారు. అప‌ర చాణుక్యుడిగా దేశంలో పేరుగాంచిన నారా చంద్ర‌బాబు నాయుడును ధీటుగా ఎదుర్కొన్నారు. అటు కేంద్రంలోను ఇటు తెలంగాణ రాష్ట్ర స‌ర్కార్‌తో స‌ఖ్య‌త‌గా వున్నారు. ప‌రిపాల‌న అంటే ఆషామాషీ వ్య‌వ‌హారం కాదు. టీడీపీకి చుక్క‌లు చూపించారు. త‌న‌కంటూ ఓ న‌మ్మ‌క‌మైన టీంను ఏర్పాటు చేసుకున్నారు. 

పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్‌గా పేరొందిన ప్ర‌శాంత్ కిషోర్‌తో కాంట్రాక్టు కుదుర్చుకున్నారు జ‌గ‌న్. ప్ర‌సార‌, ప్ర‌చుర‌ణ మాధ్య‌మాలే కాకుండా సోష‌ల్ , డిజిట‌ల్ మీడియాల‌ను ఆయ‌న వాడుకున్నంత‌గా ఏ నాయ‌కుడు వాడుకోలేదు. అంత‌టా పాజిటివ్ వేవ్‌ను రాష్ట్ర వ్యాప్తం చేశాడు పీకే. ఇంకేం చాప కింద నీరులా బాబు బ‌ల‌హీన‌త‌ల‌ను గుర్తించారు. ఆ వైపు మెల్ల‌గా చాప కింద నీరులా న‌రుక్కుంటూ వ‌చ్చారు. గొంతు మీద‌కు వ‌చ్చే స‌రిక‌ల్లా దానిని గుర్తించ‌లేక పోయారు టీడీపీ అధినేత‌. అభివృద్ధి మంత్రం పేరుతో ప‌నులు చేసుకుంటూ పోయారే త‌ప్పా జ‌నానికి ఏం కావాలో గుర్తించ‌లేక పోయారు. అధికార పార్టీ నేత‌లు, ప్ర‌జా ప్ర‌తినిధులు ప్ర‌జ‌ల‌కు దూర‌మ‌వుతూ వ‌చ్చారు. వారి ఆగ‌డాలు మితి మీరి పోయాయి. జ‌నం వీరిని భ‌రించే స్థితిలో లేకుండా పోయారు. జాబు రావాలంటే బాబు రావాలి అన్న నినాదం ..రివ‌ర్స్ అయింది. 

ప్ర‌జా వ్య‌తిరేక‌తను చాలా తెలివిగా క్యాష్ చేసుకున్నారు వైసీపీ అధినేత‌. ఇంకేం అధికారంలోకి ఖాయమ‌ని ఆయ‌న‌కు స్ప‌ష్ట‌మైంది. అనామ‌కుల‌ను సైతం ఎంపిక చేసి..ముందే అభ్య‌ర్థులుగా ప్ర‌క‌టించారు. పాల‌కుల నిర్ల‌క్ష్యం వైఖ‌రిని, బాధ్య‌తా రాహిత్యాన్ని బ‌హిరంగంగా వెల్ల‌డి చేయ‌డం, బాబు పాల‌న‌లో చోటు చేసుకున్న అవినీతి, అక్ర‌మాల గురించి వివ‌రాల‌తో స‌హా బ‌య‌ట పెట్టడంలో స‌క్సెస్ అయ్యారు. అటు రాష్టంలో ఇటు దేశ వ్యాప్తంగా జ‌గ‌న్ గురించి పాజిటివ్ మోడ్‌లో మీడియా ప్రొజెక్ట్ చేసింది. ఇది కూడా ఆయ‌న‌కు ప్ల‌స్ పాయింట్‌గా మారింది. తాను ఏ స‌మ‌యంలోనైతే పాద‌యాత్ర చేప‌ట్టారో ..అప్పుడు త‌న దృష్టికి ప్ర‌జ‌లు తీసుకు వ‌చ్చిన ప్ర‌తి స‌మ‌స్య‌ను ఆయ‌న నోట్ చేసుకున్నారు. ప్ర‌జ‌లు అనూహ్య‌మైన రీతిలో జ‌గ‌న్‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. ప‌వ‌ర్ లోకి వ‌చ్చేలా చేశారు. ఎవ‌రిపై ఆధార‌ప‌డ‌కుండానే అసెంబ్లీ, లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో థంబింగ్ మెజారిటీని క‌ట్ట‌బెట్టారు. దీంతో తాను తీసుకునే నిర్ణ‌యాల‌కు ఎవ‌రి ఆమోదం అక్క‌ర్లేదు. 

ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యంలో తాను ఇచ్చిన ప్ర‌తి హామీకి క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని జ‌గ‌న్ సీఎం ప్ర‌మాణ స్వీకార స‌మ‌యంలో ప్ర‌క‌టించారు. జ‌నం సాక్షిగా వారు ప‌డుతున్న ఇబ్బందులు ఏమిటో త‌న‌కు తెలుసున‌ని చెప్పారు. ఇంకేం ప‌వ‌ర్ లోకి వ‌చ్చిన త‌క్ష‌ణ‌మే ప్ర‌జా నాయ‌కుడి అవ‌తారం ఎత్తారు. జ‌న‌రంజ‌క‌మైన పాల‌న‌ను అందించేందుకు కృషి చేస్తున్నారు. 5 ల‌క్ష‌ల కొలువుల భ‌ర్తీకి శ్రీ‌కారం చుట్టారు. ఉద్యోగ‌స్తుల‌కు ఐఆర్ ప్ర‌క‌టించారు. న‌ష్టాల్లో కూరుకు పోయిన ఆర్టీసీకి కాయ‌క‌ల్ప చిక‌త్స చేశారు. ప్ర‌భుత్వ ప‌రం చేసుకుంటున్నామ‌ని, న‌ష్టాల‌ను స‌ర్కారే చూసుకుంటుంద‌ని ..ఇక నుంచి వారంతా స‌ర్కార్ సిబ్బందేనంటూ సీఎం ప్ర‌క‌టించారు. 

జీతాల‌కు నానా ఇబ్బందులు ప‌డే ..జ‌ర్న‌లిస్టుల‌కు తీపి క‌బురు అందించారు. క్యాంటిన్ లో ఉచిత భోజ‌నం, ఏ బ‌స్సులో ప్ర‌యాణించినా స‌రే డ‌బ్బులు చెల్లించాల్సిన ప‌ని లేదు. సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టుల‌కు 15 వేల రూపాయ‌ల పెన్ష‌న్, అక్రిడేష‌న్ జారీ విష‌యంలో నిబంధ‌న‌ల‌ను స‌ర‌ళ‌త‌రం చేస్తామ‌ని తెలిపారు. అంగ‌న్‌వాడిల‌కు జీతం పెంచారు. ప్ర‌తి ఊరికో వాలంటీర్‌ను ఎంపిక చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. మ‌రో ఐదేళ్ల పాటు ప‌వ‌ర్‌లో ఉండాల‌నే ఆలోచ‌న‌తో ఇప్ప‌టి నుంచే అడుగులు వేస్తున్నారు ఈ యువ‌నాయ‌కుడు. మొత్తం మీద తాను మాట‌ల మ‌నిషిని కాద‌ని..చేత‌ల నాయ‌కుడినంటూ చెప్ప‌క‌నే చెప్పారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!